Unknown Facts About China: అక్కడ ప్రజాస్వామ్యం ఉండదు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదీ సాగదు. ప్రభుత్వం ఏది అనుకుంటే అదే చేస్తుంది. పెద్దపెద్ద భవనాలను నిర్మిస్తుంది.. గిట్టని దేశాల మీద దాడులు చేస్తుంది.. అవసరమైతే నదుల రూపురేఖలు పూర్తిగా మార్చేసి వరదలతో నాశనం చేస్తూ ఉంటుంది. నిర్బంద కాండ అంటే ఏమిటో ప్రజలకు రుచి చూపిస్తూ ఉంటుంది. ఈ విషయాలు ప్రపంచానికి తెలియదు. ప్రపంచానికి తెలియాలని కూడా ఆ దేశం అనుకోదు. ఒకరకంగా చెప్పాలంటే తొట్టి నార తీస్తూ ఉంటుంది.
ప్రపంచంలో కమ్యూనిజం అంటే ఏంటో తమను చూసి నేర్చుకోవాలని చెప్పే ఆ దేశ పరిపాలకులు ఉదయం సమన్యాయం గురించి.. రాత్రి పారిశ్రామికవేత్తల గురించి మాట్లాడుతుంటారు. క్రోనీ క్యాపిటలిజం అని పుస్తకాల్లో మాత్రమే మనం చదువుకున్నాం. కానీ ఆ దేశంలో ప్రతిక్షణం అది కనిపిస్తూనే ఉంటుంది. ఇదంతా చెబుతుంటే మీకు ఇప్పటికే ఒక క్లారిటీ రావాలి.. ఆ క్లారిటీ పేరు చైనా.
చైనా అనేది ఒక దుర్మార్గ దేశం. ప్రపంచంలో సామ్రాజ్యవాదానికి అమెరికా పెట్టింది పేరైతే.. దానికి మించి పది ఆకులు ఎక్కువ చదువుకుంది చైనా. చైనాలో సిద్ధాంతాలు.. సమన్యాయాలు ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయాయి. అక్కడ జరుగుతున్నది కేవలం క్రోనీ క్యాపిటలిజం మాత్రమే. ఈ విషయాన్ని నేరుగా చెబితే చైనా పరిపాలకులు ఒప్పుకోరు.. మన దేశంలో ఉన్న సో కాల్డ్ ఎర్రి సన్నాసులు కూడా అంగీకరించరు.
ప్రపంచానికి చైనా అభివృద్ధి మోడల్ గా కనిపిస్తూ ఉంటుంది. పెద్దపెద్ద భవనాలతో ఆ దేశం నిండుగా దర్శనమిస్తూ ఉంటుంది.. కానీ, చైనా లో మరో కోణం ఉంది. ఎందుకంటే ఆ దేశంలో మురికివాడలు ఎక్కువగా ఉంటాయి. కరెంటు ప్రసారం కాని ప్రాంతాలు కూడా అధికంగానే ఉంటాయి. ఈ వీడియోలు ఇప్పుడు బయటకు వచ్చాయి.. మురికివాడలలో ప్రజలు ఇబ్బంది పడుకుంటూ సాగిస్తున్న జీవనం
.. తాగునీటి కోసం పడుతున్న ఇబ్బంది.. ఒకే బెడ్ మీద ముగ్గురు, నలుగురు పడుకుంటున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. ఇది ప్రపంచానికి తెలియని చైనా అంటూ.. ఇది ఆ దేశానికి సంబంధించిన మురికి బాగోతం అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.. ఈ వీడియో చూసిన తర్వాత మన దేశంలో ఉన్న ఎర్రి సన్నాసులు ఎలా కామెంట్ చేస్తారో చూడాల్సి ఉంది.
I urge everyone to push the reality of China. For years, the fake propaganda of CCP has established a “nice and developed” image of China. But I want to open everyone’s eyes today.
This is the real China, living in poverty and slums.
Follow me for this!pic.twitter.com/urPSPQiM0h— Dude (@i_yourdude) June 15, 2026
