Ecuador
Ecuador: ఇంట్లో ఓ గంటపాటు కరెంటు పోతేనే మనకు చిర్రెత్తుకొస్తుంది. ఇంకా కరెంటు ఎప్పుడు వస్తుందని విద్యుత్ అధికారులు, సిబ్బందికి ఫోన్లు చేసి ఇబ్బంది పెడతాం. ఇక ఊరంతా కరెంటో పోయినా ఇదే పరిస్థితి. మరి దేశమంతా కరెంటు పోతే.. ఈ సందర్భాలు కూడా ఉన్నాయి. పర్యావరణ పరిరక్షణ నిమిత్తం అప్పుడప్పుడు రాత్రి వేళలో పవర్ కట్ చేస్తుంటారు. అయితే మొత్తం పవర్ గ్రిడ్ ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటి. ఎంత నరకంగా ఉంటుంది అంటే ఊహించడమే కష్టం. కానీ అలాంటి నరకాన్ని ఆ దేశ ప్రజలు అనుభవించారు. ఆ దేశం మొత్తం ఒకేసారి పవర్ పోయింది. దీంతో ఆస్పత్రులు, ఇళ్లు, సబ్‌వేలు, రైల్వేలు ఇలా ప్రతీ ఒక్క వ్యవస్థ అస్తవ్యస్తం అయింది.
ఈక్వెడార్‌లో…
దక్షనిణ అమెరికా దేశమైన ఈక్వెడార్‌లో ఇలాంటి పరిస్థితి తలెత్తింది. బుధవారం(జూన్ 19)న దేశం మొత్తం ఒకేసారి విద్యుత సరఫరా నిలిచిపోయింది. దీంతో ట్రాఫిక్ సిగ్నళ్ల నుంచి రైల్వే లైన్ల వరకు అన్నీ రకాల సేవలు నిలిచిపోయాయి. విద్యుత్ నిర్వహణ, ట్రాన్స్ మిషన్‌లో సమస్య కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు వెల్లడించారు. చిన్న పిల్లల ఆస్పత్రుల్లో కరెంటు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
కొత్త పంపిణీ వ్యవస్థ ఏర్పాటుకు..
కొత్త పంపిణీ వ్యవస్థ ఏర్పాటుకు నిర్వహణకు సరైన నిధుల కేటాయింపు లేకపోవడంతోనే నేడు విద్యుత్ వ్యవస్థ కుప్ప కూఏలింది. అని పబ్లిక్ ఇన్‌ఫ్రాస్టక్చర్ మంత్రి రాబర్టో లూక్యూ తెలిపారు. కొన్ని గంటలపాటు అంధకారం తర్వాత బుధవారం అర్ధరాత్రి తిరిగి 95 శాతం ప్రాంతాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించామని తెలిపారు. 2004 తర్వాత ఈ దేశంలో విద్యుత్ వ్యవస్థ కుప్పకూలడం ఇదే తొలిసారి.
కొన్నేళ్లుగా సమస్య..
ఈక్వెడార్ కొన్నేళ్లుగా విద్యుత్ సమస్యతో తీవ్ర అవస్థలు పడుతోంది. ఇటీవల ఏప్రిల్‌లో దేశాధ్యక్షుడు ఎనర్జీ ఎమర్జెన్సీని ప్రకటించారు. దీంతోపాటు రోజువారీ 8 గంటలపాటు కరెంటు కోతులు కూడా అమలు చేస్తున్నారు.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
View Author's Full InfoWeb Title: The entire country of ecuador lost electricity at the same time