Sorry Trump: ఒకే దెబ్బకు రెండు పిట్టలు అని చిన్నప్పుడు చదువుకొని ఉంటాం కదా. అప్పుడప్పుడు ఈ నానుడి ఏదో ఒక సందర్భంలో వినే ఉంటాం కదా. ఇప్పుడు ఈ నానుడి ని మార్చుకోవాలి. దానిని ఒకే దెబ్బకు మూడు పిట్టలు అని చదువుకోవాలి. ఈ నానుడిని అలా మార్చింది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi).
రష్యా (Russia) నుంచి చమురు కొనుగోలు చేస్తోంది అనే అక్కసుతో అమెరికా (United States of America) అధ్యక్షుడు ట్రంప్ (Trump) మన మీద ఏకంగా 50 శాతం సుంకాలు విధించాడు కదా. ఇప్పుడు ఏకంగా దానిని 500 శాతానికి పెంచుతామని భయపెట్టిస్తున్నాడు. తద్వారా రష్యా నుంచి చమురు కొనుగోలు చేయకుండా అడ్డుకట్ట వేస్తున్నాడు. అమెరికాలో తన విధానాల పట్ల వస్తున్న వ్యతిరేకతను చల్లార్చడానికి ట్రంప్ ఇలాంటి పనికిమాలిన ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే సిరియా, క్యూబా, ఇరాన్, వెనిజులా దేశాల మీద దాడులు మొదలుపెట్టాడు ట్రంప్. చమురు వ్యాపారం మీద ఆధిపత్యం కొనసాగించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.. అయితే, ప్రపంచంలోనే అతిపెద్ద కన్జ్యూమర్ మార్కెట్ అయిన భారత్ ను తన చెప్పుచేతల్లో ఉంచుకోవడానికి ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నాడు.
ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏకపక్షంగా తోసి పుచ్చారు. అమెరికా ఎన్ని రకాలుగా ఒత్తిళ్లు తీసుకొచ్చినప్పటికీ, ఏమాత్రం తగ్గకుండా ముందడుగు వేస్తున్నారు ప్రధాన నరేంద్ర మోడీ. అమెరికా తయారుచేసిన ఎఫ్ 35 (F-35), ఎఫ్ – 16(F-16), ఎఫ్ -18 (F-18), ఎఫ్ -21(F-21) వంటి యుద్ధ విమానాలను కొనుగోలు చేసేది లేదని భారత్ స్పష్టం చేసింది. అంతేకాదు, ఈ యుద్ధ విమానాలను భారత్ వచ్చి తయారు చేస్తామని అమెరికా కంపెనీలో ఆఫర్ ఇచ్చినప్పటికీ.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒప్పుకోలేదు. చివరికి ఫ్రాన్స్ దేశం రూపొందించిన రఫెల్ యుద్ధ విమానాలను భారత్ కొనుగోలు చేయడానికి సిద్ధపడింది. ఇందులో ముఖ్యంగా రఫెల్ – ఎం అనే రకానికి చెందిన యుద్ధ విమానాలను భారత్ కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ వేల కోట్లు ఉంటుందని తెలుస్తోంది.
రఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ద్వారా భారత్ అటు అమెరికాకు, ఇటు చైనా(China)కు ఏకకాలంలో స్పష్టమైన సమాధానం చెప్పింది. ఇప్పటికే మన ఆయుధ సామగ్రి ఎలా పనిచేస్తుందో పాకిస్తాన్ దేశానికి ఆపరేషన్ సిందూర్ ద్వారా అనుభవంలోకి వచ్చింది. వాస్తవానికి రఫెల్ డీల్ విజయవంతం కావద్దని చైనా అనుకుంది. అయితే భారత అభ్యర్థన మేరకు ఫ్రాన్స్ తమ దేశంలో కాకుండా.. భారత దేశంలో రఫెల్ యుద్ధ విమానాలను తయారు చేసింది. భవిష్యత్ కాలంలో ఏవైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే ఫ్రాన్స్ నిపుణులు వచ్చి మరమ్మతు చేయాల్సి ఉంటుంది. ఐఎన్ఎస్ విక్రాంత్ ద్వారా రఫెల్ ను మనకు శత్రువులుగా ఉన్న దేశాల మీద ప్రయోగిస్తే.. అప్పుడుగాని భారత దేశ సామర్థ్యం ఏమిటో ప్రపంచానికి తెలుస్తుంది. రఫెల్ యుద్ధ విమానాల డీల్ నేపథ్యంలో సోషల్ మీడియాలో #SorryTrump అనే యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.