Saudi Arabia: ఇస్లాం మతాన్ని ఆచరించేవారు.. అల్లాను ఆరాధిస్తారు. అల్లా కొలువైవున్న ప్రముఖ పుణ్యక్షేత్రాలు మొత్తం సౌదీ అరేబియాలోనే ఉన్నాయి. సౌదీ అరేబియాలో ప్రతిదీ పద్ధతి ప్రకారం జరుగుతుంటుంది. సౌదీ అరేబియాలో నిబంధనలు కట్టుదిట్టంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో అక్కడ మద్యం అనేది ఉండదు. పైగా గతంలో మద్యం అనే మాట వినిపిస్తే అక్కడ కఠిన శిక్షలు విధించేవారు.. అయితే ఇప్పుడు అక్కడ పరిస్థితి లో మార్పు వచ్చింది.
సౌదీ అరేబియాలో రియాద్ ప్రాంతంలో డిప్లమాటిక్ క్వార్టర్ ఉండేది. ఈ క్వార్టర్ లో బోర్డు అనేది లేని ఒక దుకాణం ఉంది. ఈ దుకాణంలోకి ఎవరినీ రానివ్వరు. గత ఏడాది జనవరిలో కేవలం ముస్లింలు కాని దౌత్యవేతల కోసం ఈ దుకాణం మొదలైంది.. ఇందులో మద్యం అందుబాటులో ఉండేది.. అయితే ఇప్పుడు ఈ దుకాణం మిగతా వారికి కూడా అందుబాటులో ఉంటుంది.. ముందస్తుగా ఎటువంటి ప్రకటన చేయకుండానే ప్రీమియం రెసిడెన్సి అనే హోదా ఉన్న విదేశీయులకు ఈ ప్రాంతంలో మద్యం కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించడం ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది.
అయితే ఈ దుకాణంలోకి ప్రవేశించడం అంత సులభం కాదు. ఎంట్రీ పాయింట్ వద్ద అత్యంత లోతుగా తనిఖీలు చేస్తారు. ఫోన్లు స్వాధీనం చేసుకుంటారు. కెమెరాలు లాక్కుంటారు. చివరికి కళ్ళజోడు కూడా ధరించనియ్యరు. ఒకవేళ అవి స్మార్ట్ గ్లాస్ అయితే స్వాధీనం చేసుకుంటారు. ఇక ఇక్కడ మద్యం ధరల విషయంలో తేడాలు ఉంటాయి. దౌత్యవేత్తలకు ఎటువంటి పన్నులు ఉండవు. కానీ కొత్త వినియోగదారులకు మాత్రం చుక్కలు కనిపిస్తాయి…
సౌదీ అరేబియా దేశానికి చెందినవారు మద్యం తాగాలి అనుకుంటే పక్కనే ఉన్న బహ్రయిన్ ప్రాంతానికి వెళ్లేవారు. కొందరైతే దుబాయ్ కూడా వెళ్లేవారు.. అంత దూరం వెళ్లలేని వారు చాటు మార్గంలో భారీగా ధర చెల్లించి మద్యం కొనుగోలు చేసేవారు. అయితే ఇప్పుడు అనేక రకాల మార్పులు చోటు చేసుకోవడంతో ప్రీమియం రెసిడెన్సి విదేశీయులకు సౌదీ అరేబియాలో దర్జాగా మద్యం లభిస్తోంది.. ఆ మద్యం తాగిన వారు ఫుల్లుగా మత్తులో జోగుతున్నారు.
ఇప్పటికే సౌదీ అరేబియాలో మహిళలు డ్రైవింగ్ సీట్లలో ప్రవేశించారు. దర్జాగా వాహనాలను తోలుతున్నారు. మద్యం దుకాణాలు కూడా త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ మద్యం ప్రీమియం రెసిడెన్సి ఉన్న విదేశీయులకు మాత్రమేనా? మిగతా వారికి కూడా లభిస్తుందా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది. 1951లో సౌదీ దేశంలో మద్యం నిషేధించారు. సౌదీ వ్యవస్థాపక రాజైన అబ్దుల్ అజీజ్ కుమారుడు మిశారీ విపరీతంగా మద్యం తాగేవాడు. తాగిన మైకంలో జెడ్డా నగరంలోని బ్రిటిష్ వైస్ కాన్సుల్ ను దారుణంగా కాల్చి చంపాడు. అప్పటినుంచి ఈ దేశంలో మద్యంపై నిషేధం ఉంది. అయితే ఈ దేశంలోకి దౌత్యవేత్తలు విపరీతంగా వస్తున్న నేపథ్యంలో ప్రస్తుత రాజు సల్మాన్ నిబంధనలను క్రమక్రమంగా చదివించే ప్రయత్నం చేస్తున్నారు. సౌదీ అరేబియా అభివృద్ధికి ఆయన ఏకంగా విజన్ 2030 అనే ప్లాన్ కూడా రూపొందించారు.