Safe and Dangerous Countries : ప్రపంచవ్యాప్తంగా అత్యంత సురక్షితమైన(Safe), ప్రమాదకరమైన(Danger)దేశాల జాబితా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ (మార్చి 20) సందర్భంగా ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ(Oxford University)లోని వెల్‌బీయింగ్ రీసెర్చ్ సెంటర్ ‘వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ – 2025’ను విడుదల చేసింది. ఈ జాబితాలో ఫిన్‌లాండ్ వరుసగా ఎనిమిదోసారి అగ్రస్థానంలో నిలిచింది. అదే సమయంలో, క్రౌడ్‌సోరŠస్డ్(Croud soraksd) డేటా ప్లాట్‌ఫామ్ నంబియో నేరాల రేటు ఆధారంగా 2025 కోసం సురక్షిత, ప్రమాదకర దేశాల జాబితాను ప్రకటించింది.
Also Read : ట్రంప్ సంచలనం.. దిగుమతి కార్లపై 25% సుంకం
సురక్షిత దేశాలు..
నంబియో సర్వే ప్రకారం, స్పెయిన్, ఫ్రాన్స్ మధ్య ఉన్న చిన్న దేశం ‘అండోరా’ 84.7 భద్రతా స్కోరుతో ప్రపంచంలోనే అత్యంత సురక్షిత దేశంగా నిలిచింది. కేవలం 181 చదరపు మైళ్ల విస్తీర్ణం, 82,638 జనాభాతో ఈ దేశం ప్రయాణికులకు ఉత్తమ గమ్యంగా గుర్తింపు పొందింది. రెండో స్థానంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (84.5), మూడో స్థానంలో ఖతార్ (84.2), తర్వాత తైవాన్ (82.9), ఒమన్ (81.7) ఉన్నాయి. ఈ దేశాలు తక్కువ నేరాల రేటు, ఉన్నత భద్రతా ప్రమాణాలతో ఆకట్టుకున్నాయి.
భారతదేశం ఈ జాబితాలో 55.7 స్కోరుతో 66వ స్థానంలో నిలిచింది. అగ్రరాజ్యం అమెరికా 50.8 స్కోరుతో 89వ స్థానంలో, యునైటెడ్ కింగ్‌డమ్ 51.7 స్కోరుతో 87వ స్థానంలో ఉన్నాయి. అయితే, వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్‌లో భారత్ 147 దేశాల్లో 118వ స్థానంలో ఉంది, దీని స్కోరు 4.389గా నమోదైంది. ఇది గత సంవత్సరం (126వ స్థానం)తో పోలిస్తే మెరుగుదలే అయినప్పటికీ, ఇంకా పొరుగు దేశాలైన పాకిస్తాన్ (109), నేపాల్ (92) కంటే వెనుకబడే ఉంది.
ప్రమాదకర దేశాలు..
ఇక ప్రమాదకర దేశాల విషయానికొస్తే, వెనిజులా 19.3 స్కోరుతో అత్యంత ప్రమాదకర దేశంగా నిలిచింది. దీని తర్వాత పాపువా న్యూ గినియా (19.7), హైతీ (21.1), ఆఫ్ఘనిస్తాన్ (24.9), దక్షిణాఫ్రికా (25.3) ఉన్నాయి. ఈ దేశాల్లో నేరాల రేటు, అస్థిరత ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. నంబియో ఈ జాబితాను రూపొందించడానికి పగలు, రాత్రి భద్రత, దొంగతనాలు, వేధింపులు, జాతి–మత వివక్ష వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంది. సురక్షిత దేశాల్లో అండోరా అగ్రస్థానంలో ఉండగా, హ్యాపీనెస్ రిపోర్ట్‌లో ఫిన్‌లాండ్ ఆనంద సూచికలో ముందంజలో ఉంది. ఈ రెండు జాబితాలు దేశాల భద్రత, జీవన నాణ్యతను వేర్వేరు కోణాల్లో చూపిస్తున్నాయి.
Also Read : భారత్–అమెరికా వాణిజ్య చర్చలు.. సుంకాల సవాల్‌పై సామరస్యం వైపు..