Russia S-500 missile: రష్యా.. అత్యాధునిక ఆయుధాల తయారీలో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది. ప్రపంచ పెద్దన్నగా చెలామణి అవుతున్న అమెరికా ప్రపంచంలో తామే తోపు అనుకుంటుంది. కానీ రష్యా, చైనా, భారత్, ఇజ్రాయెల్, ఫ్రాన్స్ అమెరికా టెన్నాలజీని మించి ఆయుధాలు తయారు చేస్తున్నాయి. ఇందుకు రష్యా తాజాగా తయారు చేసిన ఎస్–500 ’ప్రమోథీస్’ నిదర్శనం. ఈ వాయు రక్షణ వ్యవస్థను పూర్తిగా అమలులోకి వచ్చింది. ఎఫ్–22, ఎఫ్–35 వంటి అమెరికా స్టెల్త్ యుద్ధవిమానాలు, బాలిస్టిక్ మిసైళ్లు, హైపర్‌సోనిక్ ఆయుధాలు, లో–ఆర్బిట్ సాటిలైట్లను కూడా లక్ష్యంగా చేసుకునే సామర్థ్యం ఉందని రష్యా ప్రకటించింది. ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ వాయు రక్షణ వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తోంది.
అసాధారణ రేంజ్, టార్గెట్ ట్రాకింగ్
ఎస్ – 500 ప్రమోథీస్ 600 కి.మీ దూరంలో ఉన్న మిస్సైళ్లు, డ్రోన్లు, రాకెట్ లాంఛర్లను గుర్తిస్తుంది. స్టెల్త్ టెక్నాలజీని గుర్తించే అధిక రిజల్యూషన్ స్కానర్లు ఉన్నాయి. రాకెట్ వేగంగా టార్గెట్‌ను నాశనం చేసే సాంకేతికత ఉంది. ఎస్–400 కన్నా అడ్వాన్స్ టెక్నాలజీతో ఈ వ్యవస్థ పనిచేస్తుంది. రష్యన్ ఎయిర్ స్పేస్‌ను అభేధ్యంగా మార్చింది.
స్టెల్త్ ఫైటర్లకు ఇక దబిడి దిబిడే..
అమెరికా 5వ తరం ఫైటర్లు రాడార్‌లకు తప్పిపోయే స్టెల్త్ డిజైన్‌తో ఉన్నా, ఎస్–500 మల్టీ–ఫ్రీక్వెన్సీ రాడార్లు వాటిని సులభంగా గుర్తిస్తాయి. 2000 కి.మీ./గం వేగంతో వస్తున్న హైపర్‌సోనిక్ మిసైళ్లను కూడా 5 నిమిషాల్లో ఆపగలదు. లో ఆర్బిట్ స్పేస్ ఆస్ట్రా సాటిలైట్లను కూడా కిందపడేసే సామర్థ్యం ఉంది. ఎస్ – 400, ఎస్ – 500 రష్యా భూభాగాన్ని అణ్వాయుధాలు, డ్రోన్‌లు, క్రూజ్ మిసైళ్ల నుంచి పూర్తిగా కాపాడుతుంది. అమెరికా బీ–21 రాయిడర్ బాంబర్‌లు కూడా ఈ వ్యవస్థకు తట్టుకోలేకపోతాయి.
అమెరికా ఆందోళన..
ఎస్–500 అమలు అమెరికా వాయు సైన్యానికి తీవ్రమైన సవాల్. ఎఫ్–35లు, బీ–2 స్టెల్త్ బాంబర్లు ఇక రష్యా గోడను దాటలేవు. ఇది యుద్ధ వ్యూహాలను మార్చేస్తుంది. స్టె్టల్త్ టెక్నాలజీపై రష్యా ప్రధాన్యత పెంచింది. నాటో దేశాలు కూడా ఈ సాంకేతికతను అధ్యయనం చేస్తున్నాయి.
ఎస్–500 ఎగుమతి మార్కెట్‌లో భారీ డిమాండ్‌కు దారితీస్తుంది. భారత్, చైనా, ఈజిప్ట్, టర్కీ వంటి దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. ఎస్–400 కంటే మెరుగైన ఈ వ్యవస్థ అమెరికా ప్యాట్రియట్, థాడ్ వ్యవస్థలకు పోటీగా నిలుస్తుంది. రష్యా ఎయిర్ డిఫెన్స్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమం. అమెరికా స్టెల్త్ ఆధిపత్యం చివరి దశలోకి చేరింది.