Pakistan Beggars: పాకిస్తాన్.. ప్రపంచంలో ఆగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న దేశాల్లో ఒకటి. ఆర్థికంగా దివాళా తీస్తున్నా.. భారత్‌తో తరచూ కయ్యానికి కాలుదువ్వుతుంది. అప్పుల కోసం ప్రపంచ దేశాలను యాచిస్తోంది. ఐఎంఎఫ్ నుంచి భారీగా రుణాలు తీసుకుంది. పాకిస్తాన్ మంత్రికి ఇటీవలే లండన్‌లో ఘోర అవమానం ఎదురైంది. మంత్రి కారును అక్కడి పోలీసులు తనిఖీ చేశారు. తాజాగా పాకిస్తానీల తీరుతో ముస్లిం దేశాలు కూడా ఆదేశం ఇజ్జత్ తీస్తుర్నాయి. ఆర్థికంగా కుంగిపోయిన పాకిస్తాన్ నుంచి వలస వెళ్లి సౌదీ అరేబియా, యూఏఈ, అజర్బైజాన్లో అక్రమంగా ఉంటున్న పాకిస్తానీలను తిరిగి పంపుతున్నాయి. పాకిస్తానీలు తమ దేశాల్లో భిక్షాటన మాఫియాగా మారారని, నేరాలకు పాల్పడుతున్నారని ఆ దేశాలు ఆరోపిస్తున్నాయి. ఇవి పర్యాటకరంగానికి ముప్పుగా మారుతున్నాయని పేర్కొంటున్నాయి.
భారీ స్వదేశానికి..
సౌదీ అరేబియా నుంచి 24 వేల మంది, యూఏఈ నుంచి 6 వేల మంది, అజౖర్బైజాన్ నుంచి 2,500 మంది పాకిస్తాన్‌కు తిరిగి చేరుకున్నారు. వీరంతా ఆర్గనైజ్డ్ భిక్షాటన గ్యాంగుల్లో భాగంగా వెళ్లినవారని నిర్ధారించాయి. విద్య, ఉద్యోగాల కోసం వెళ్లినవారిని కూడా తిప్ప పపుతున్నాయి. దీనిపై పాకిస్తాన్ అభ్యంతరం చెబుతోంది.
సౌదీ హెచ్చరికలు..
2024లోనే సౌదీ పాకిస్తాన్‌ను హెచ్చరించింది. ఉమ్రా వీసాలను భిక్షాటనకు ఉపయోగించకూడదని తెలిపింది. మక్కా, మదీనాలో యాత్రికులను వేధించే భిక్షాటనలో పాకిస్తానీలే ఉంటున్నారని పేర్కొంది. హజ్, ఉమ్రా యాత్రలపై ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరించినా సమస్య కొనసాగుతోంది.
యూఏఈలో పాకిస్తానీ నేరాలు..
తమ దేశానికి వలస వచ్చిన పాకిస్తానీలు నేరాలకు పాల్పడుతున్నారని యూఏఈ ఆరోపించింది. ఈ మేరకు వీసా పరిమితులు విధించింది. ఆఫ్రికా, యూరప్, థాయ్‌లాండ్, కాంబోడియాలో కూడా పాక్ పౌరులు భిక్షాటన మాఫియాలతో ముడిపడి ఉన్నారు. పశ్చిమాసియాలో పట్టుబడిన 90% యాచకులు పాక్ చెందినవారేనని అధికారి జీషాన్ ఖంజాదా పేర్కొన్నాడు.
యాచక ముఠాలను నియంత్రించేందుకు పాకిస్తాన్ ఎఫ్ఐఏ ఈ ఏడాది విమానాశ్రయాల్లో 66,154 మందిని అరెస్ట్ చేసింది. పాకిస్తాన్‌కు చెందిన డాన్ పత్రిక పవిత్ర స్థలాల వద్ద పాక్ భిక్షాటనకారుల సమస్యపై కథనం చేసింది. ఎఫ్ఐఏ డైరెక్టర్ ఈ నెట్వర్క్ పాక్ ఇమేజ్‌కు హాని చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. షెహబాజ్ ప్రభుత్వం సైన్య సహాయంతో చర్యలు తీసుకున్నా ఫలితాలు తక్కువగా ఉన్నాయి.