Shehbaz Sharif headphone struggle: ఎన్నికల్లో ఎలా గెలిచినప్పటికీ.. గెలిచిన ప్రజా ప్రతినిధి కొన్ని విషయాలను పాటించాలి. కొన్ని గౌరవాలను కాపాడుకోవాలి. కొన్ని మర్యాదలను ఒంట పట్టించుకోవాలి. లేకపోతే పరువు పోగొట్టుకోవాల్సి వస్తుంది. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ పరిస్థితి కూడా అలానే ఉంది.. అంతర్జాతీయ వేదికల్లో ఏ దేశం పట్టించుకోకపోగా.. చివరికి ఆయన వ్యవహార శైలి కూడా సరిగ్గా లేక.. పాకిస్తాన్ కు ఉన్న ఆ కాస్త పరువు కూడా పోతోంది.
మూడు సంవత్సరాల క్రితం ఉజ్బెకిస్తాన్ లో ప్రసాద్ అధ్యక్షుడు పుతిన్, షరీఫ్ చర్చల నిమిత్తం భేటీ అయ్యారు. ఆ సందర్భంలో షరీఫ్ చెవిలో ఇయర్ ఫోన్ పెట్టుకోవడానికి అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు.. అప్పట్లో ఆ వీడియో సోషల్ మీడియాలో పెను దుమారాన్ని రేపింది. ఇప్పుడు కూడా ఆయన చైనాలో నిర్వహించిన ఓ సదస్సులో అదే విధంగా ఇబ్బంది పడ్డారు..
రష్యా అధిపతి తన చెవిలో ఇయర్ ఫోన్ పెట్టుకొని భేటీకి సిద్ధంగా ఉండగా.. పాకిస్తాన్ ప్రధానమంత్రి మాత్రం తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. దీంతో ఆయన పక్కన ఉన్న అధికారులు సహాయం చేయాల్సి వచ్చింది. ఒకానొక సందర్భంలో రష్యా అధిపతి టీచర్ అవతారం ఎత్తాల్సి వచ్చింది. ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థికి పాఠాలు చెప్పినట్టు.. ఇదిగో ఇలా ఇయర్ ఫోన్ తీసి పెట్టుకోవాలి అని చూపించారు.. వివిధ దేశాల నుంచి వచ్చిన మీడియా ప్రతినిధుల ముందు పాకిస్తాన్ ప్రధానమంత్రి పరువు పోకుండా ఉండడానికి రష్యా అధిపతి తనవంతు ప్రయత్నం చేశారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా భారతీయ నెటిజన్లు పాకిస్తాన్ ప్రధాని ఒక ఆట ఆడుకుంటున్నారు..”మీరు ఎన్నికల్లో ఎలా అయినా గెలవండి. అంతర్జాతీయ వేదికల ముందు హుందాతనాన్ని ప్రదర్శించండి. ఆ హుందాతనాన్ని కాపాడుకోకపోతే ఇదిగో ఇలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పటికైనా ప్రజాస్వామ్యాన్ని అలవర్చుకోండి. అప్పుడు మీకు అన్ని అర్థమవుతాయి అంటూ” నెటిజన్లు చురకలు అంటిస్తున్నారు. అయితే ఈ వీడియో పట్ల పాకిస్తాన్ సైలెంట్ అయిపోయింది. దేశ ప్రధాని బేలతనాన్ని చూసి జాలి పడడం తప్ప.. ఏమీ చేయలేని పరిస్థితి ఆ దేశానికి ఏర్పడింది.
#WATCH | Pakistan Prime Minister Shehbaz Sharif struggles with earphones again in front of Russian President Vladimir Putin in Beijing.#shehbazsharif #vladimirputin pic.twitter.com/EgGJpj86JB
— NDTV WORLD (@NDTVWORLD) September 3, 2025