https://oktelugu.com/

New Car From Hyundai: హ్యుందాయ్ నుంచి కొత్త కారు.. రాకముందే సంచలనం..

పెట్రోల్, డీజిల్ కార్లకు స్వస్తి చెప్పే రోజులు దగ్గరపడుతున్నాయి. ఇప్పుడంతా ఎలక్ట్రిక్ మయం అన్నట్లుగా ఈవీల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే చాలా వరకు విద్యుత్ వాహనాలు మార్కెట్లోకి వచ్చి సందడి చేస్తున్నాయి. తాజాగా ఓ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ కారు ఫీచర్స్ దిమ్మదిరిగే విధంగా ఉన్నాయి

Written By:
  • Srinivas
  • , Updated On : October 24, 2024 / 01:05 PM IST

    New-Car-From-Hyundai

    Follow us on

    New Car From Hyundai: పెట్రోల్, డీజిల్ కార్లకు స్వస్తి చెప్పే రోజులు దగ్గరపడుతున్నాయి. ఇప్పుడంతా ఎలక్ట్రిక్ మయం అన్నట్లుగా ఈవీల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే చాలా వరకు విద్యుత్ వాహనాలు మార్కెట్లోకి వచ్చి సందడి చేస్తున్నాయి. తాజాగా ఓ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ కారు ఫీచర్స్ దిమ్మదిరిగే విధంగా ఉన్నాయి. ఇప్పటి వరకు వచ్చిన కార్ల కంటే ఇవి భిన్నంగా ఉండడంతో పాటు అతి తక్కువ ధరకే అందుబాటులోకి రానుంది. దీంతో ఈ కారు గురించి తెలుసుకుంటున్నారు. అయితే ఇది అప్పుడే మార్కెట్లోకి రాలేదు. ముందుగా దీనిని వరల్డ్ లెవల్లో రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఆ తరువాత ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. అయితే దీని గురించి ముందే పరిచయం చశారు. ఇంతకీ ఈ కారు ఏదో తెలుసా?

    దేశంలో హ్యుందాయ్ కార్ల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే వివిధ మోడళ్లను పరిచయం చేసిన కంపెనీ తాజాగా కొత్త ఈవీని మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధం అవుతోంది. అయితే హ్యుందాయ్ మాతృదేశం అయిన సౌత్ కొరియాలో కొత్త కారు రెడీ అవుతంోది. దీనికి ‘ఇన్ స్టర్ క్రాస్’ అని పేరు పెట్టారు దీని గురించి ప్రపంచ ఆటోమోబైల్ మార్కెట్లో ఇప్పటికే ఆవిష్కరించారు. చూడ్డానికి బొమ్మలా కనిపించే ఈ కారు డిజైన్ చూస్తే మతిపోయేలా ఉంది. దీని ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే?

    హ్యుందాయ్ రెడీ చేసే ఇన్ స్టర్ క్రాస్ కారులో 49 కిలో వాట్ బ్యాటరీ ప్యాక్ ను అమర్చరున్నారు. ఈ బ్యాటరీపై 113 బీహెచ్ పీ పవర్ తో పాటు 147 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. ఈ బ్యాటరీ 12 kW ఛార్జింగ్ కు ఫుల్ సపోర్ట్ చేయనుంది. దీంతో ఛార్జింగ్ చేస్తే 30 నిమిషాల్లో 80 శాతం ఛార్జింగ్ పూర్తవుతుంది. ఫుల్ ఛార్జింగ్ అయిన ఈ బ్యాటరీతో కొత్త కారు 360 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వనుంది.

    కొత్త కారు చూడ్డానికి స్టాండర్డ్ కారులాగే కనిపిస్తుంది. దీని బేసిక్ డిజైన్ ఆకట్టుకుంటోంది. అయితే మిగతా కార్ల మాదిరిగా కాకుండా దీర్ఘ చతురస్రాకార ఆకారంలో ఇది కనిపిస్తుంది. బంపర్ల చుట్టూ ఉన్న బ్లాక్ క్లాడింగ్ ఆకట్టుకోనుంది. ఈ కారులో 10.25 అంగుళాల ఇన్పోటైన్మెంట్ సిస్టమ్ తో పాటు డ్రైవర్ స్క్రీన్ ను అమర్చనున్ారు. ఇందులో 1.5 స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్, నావిగేషన్ డేటాతో పాటు ఆటోఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ ఉన్నాయి. కారులోపల ఉన్ సీట్లు ముందు, వెనకవాటితో సంబంధం లేకుండా మడద పెట్టుకోవచ్చు.

    ఈ కారులో అడాస్ టెక్నాలజీ వంటి సేప్టీ ఫీచర్లను అమర్చనున్నారు. 17 అంగుళాల అల్లాయ్ వీల్స్, ఫాక్స్ స్కిడ్ ప్లేట్స్ వంటి వాటితో క్రేజీ లుక్ ను అందిస్తున్నాయి. అలాగే ఇది 5 విభిన్న కలర్లలో లభించనుంది. ఈ కారు ఇన్నర్ లో 280 లీటర్ల బూట్ స్పేత్ తో కలిగి ఉండనుంది. దీంతో లాంగ్ డ్రైవ్ చేసేవారికి ఇది అనుకూలంగా ఉండనుంది. దీనిని ఈ ఏడాది డిసెంబర్ లో ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం ఉంది.
    .