Mount Everest :ఎవరెస్ట్ ఎక్కాలంలే.. ఊరికే అలా వెళ్లి.. కొండను ఎక్కినట్లు ఎక్కడం కాదు. ప్రపంచంలోనే ఎత్తయిన ఈ పర్వతం ఎక్కడానికి నిబంధనలు ఉన్నాయి. జాగ్రత్తలు చాలా ముఖ్యం. ఇక పర్వతం ఎక్కడానికి రాయల్టీ చార్జి చెల్లించాలి. ఈ రాయల్టీ ఫీజు ముఖ్యంగా నేపాల్ నేపాల్, చైనా(టిబెట్) మధ్య ఉన్న ఎవరెస్టు పర్వాతరోహణ కార్యకలాపాలకు సంబంధించినది. నేపాల్ ప్రభుత్వం పర్వతారోహకుల నుంచి ఎలాంటి ఫీజు వసూలు చేయదు. పర్వతారోహణ అనుమతి కోసం నిపుణులు మరియు వాణిజ్య పర్యాటకులు ప్రతి సంవత్సరం ఫీజులు చెల్లించాలి. 2023లో, నేపాల్ ప్రభుత్వం వాణిజ్య పర్వతారోహణల కోసం 11,000 డాలర్లు (సుమారు 8 లక్షల రూపాయిలు) చెల్లించాల్సి ఉంటుంది. టిబెట్ కూడా పర్వతారోహకుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తుంది. వీసా, అనుమతులు, ఇతర సేవల కోసం భారీగా ఫీజుల తీసుకుంటుంది. రాయల్టీ పేరుతో తీసుకునే ఈ ఫీజు అనేక అంశాలకు ఉపయోగపడుతుంది. అయితే పర్వతారోహకులకు నేపాల్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పదేళ్ల తర్వాత రాయల్టీ ఫీజు భారీగా పెంచింది. గతంలో 11 వేల డాలర్లు ఉండగా ఇప్పుడు 36 శాతం పెంచింది. 15 వేల డాలర్లు చేసింది. దీంతో పర్వతారోహకులు ఆందోళన చెందుతున్నారు. ఫీజుగానే ఇంత చెల్లిస్తే ఇక ఇతర ఖర్చులు ఎలా అని ఆందోళన చెందుతున్నారు.
విదేశీ అధిరోహకుల నుంచి..
నేపాల్ విదేశీ పర్వతారోహకుల నుంచి ఫీజు వసూలు చేస్తుంది. ఆ ఫీజులు తాజాగా పెంచింది. మార్చి నుంచి మే నెల మధ్య ఎవరెస్టు పర్వతాన్ని ఎక్కేవవారు గతంలో 11 వేల డాలర్లు వసూలు చేసేవారు. దానిని నేపాల్ ప్రభుత్వం 15 వేల డాలర్లకు పెంచింది. అంటే గతంలో రూ.9.5 లక్షలు చెల్లించేవారు. ఇప్పుడు రూ.13 లక్షలు చెల్లించాలి. ఈ విషయాన్ని నేపాల్ టూరిజం బోర్డు డైరెక్టర్ హారతి న్యుపేన్ తెలిపారు.
ఇక ఇదే పర్వతాన్ని సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్యలో ఎక్కేవారు ఫీజు 5,500 డాలర్ల నుంచి 7,500 డాలర్ల(రూ.6.5 లక్షలు)లకు పెంచారు. ఆగస్టు మధ్య వానాకాలంలో ఎవరెస్టు అధిరోహించాలనుకునేవారు ఫీజు 2,750 డాలర్ల నుంచి 3,750 డాలర్లకు పెంచారు.
సెప్టెంబర్ 1 నుంచి అమలు..
పెంచిన ఫీజులు మొత్తం వచ్చే సెప్టెంబర్ 1 నుంచి అమలు చేస్తామన్నారు. చాలా ఏళ్లుగా అవే ఫీజులు కొనసాగుతున్నాయని, అందుకే ఈ ఏడాది ఫీజులు పెంచినట్లు పర్యాటక శాఖ డైరెక్టర్ నారాయణ్ ప్రసాద్ రెగ్మీ తెలిపారు. నేపాల్‌కు ఈ ఫీజు వసూలు కూడా ప్రధాన వనరే. ఇటీవల అధిరోహకులు పెరగడంతో ఎక్కడ చెత్త కూడా పెరుగుతోంది. దీనిని తొలగించడం ఖరీదైన పని. ఈ క్రమంలో రుసుము పెంచారు. అయితే ఈ రుసుము ఎలా మళ్లుతాయి అన్న విషయంపై స్పష్టత లేదు. అధిక రుసుములను క్లీన్ అప్ డ్రైవ్‌లు, వ్యర్థ పదార్థాల నిర్వహణ, స్థిరమైన ట్రెక్కింగ్ కార్యకలాపాలకు ఉపయోగిస్తారు. ఇదే సమయంలో అధిరోహకుల సంఖ్య కూడా నియంత్రించాలని భావిస్తోంది.