Most Beautiful Night Cities In World: దట్టంగా కురుస్తున్న మంచు.. సైకత శిల్పాల మాదిరిగా.. మంచు గడ్డలు.. రాత్రిపూట వెలుతురుకు మెరుస్తుండగా.. అంతకుమించి చిక్కటి చీకటిలో అవి కనిపిస్తుంటే ఆ ఆనందం వేరు. అటువంటి ఆనందం ఎన్ని కోట్లు పోస్తే దొరుకుతుంది.. స్వర్గాన్ని చూసి ఉంటారో లేదో తెలియదు.. స్వర్గం ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఈ ప్రాంతాలను చూస్తే స్వర్గం కూడా చిన్నబోతుంది. ప్రకృతి రమణీయతను.. అడుగడుగునా అద్భుతాన్ని సొంతం చేసుకున్న ఈ ప్రాంతాలు పర్యాటకులకు ఎప్పటికీ దర్శనీయ కేంద్రాలు.
అమెరికాలో చికాగో నగరానికి ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మంచు విపరీతంగా కురుస్తూ ఉంటుంది. దీనికి తోడు విద్యుత్ దీపాల వెలుగులో ఆ మంచు మరింత అందంగా కనిపిస్తూ ఉంటుంది.. ఇక్కడ మిచిగాన్ సరస్సు రాత్రిపూట ధవళ వర్ణంలో కనులకు కొత్త కాంతిని అందిస్తుంది. ఇక్కడ రాత్రిపూట జీవితాన్ని సరికొత్తగా ఆస్వాదించవచ్చు.. అందువల్లే ట్రావెల్ బ్యాగ్ అనే సంస్థ 2026లో నిర్వహించిన సర్వేలో చికాగో వరుసలో నిలిచింది. ఈ జాబితాలో టోక్యో, న్యూయార్క్ సిటీ, సింగపూర్ వంటి నగరాలు అత్యంత ప్రముఖంగా ఉన్నాయి..
ఈ జాబితాను రూపొందించడానికి ట్రావెల్ బ్యాగ్ సంస్థ కొన్ని కొలమానాలు తీసుకుంది. అందులో ఇంస్టాగ్రామ్ హ్యాష్ ట్యాగ్ ల సంఖ్య, ఆంటీ కాలుష్య స్థాయిలు, 150 మీటర్ల కంటే ఎత్తయిన ఆకాశ హర్మ్యాలను పరిగణలోకి తీసుకుంది. పర్యాటకుల అభిప్రాయం.. ఆ నగరాలలో లభించే సౌకర్యాలు.. ఆహారం.. హోటల్లు.. కనెక్టివిటీ.. సెక్యూరిటీ.. మంచు తీవ్రత.. పర్యాటకంగా చూసే ప్రాంతాలు.. ప్రభుత్వపరంగా అందే సౌలభ్యం.. వీటన్నింటిని ట్రావెల్ బ్యాగ్ పరిగణలోకి తీసుకుంది.
చికాగో నగరంలో 137 అంతస్తుల భవనాలు ఉన్నాయి. నైట్ లైఫ్ ఈ నగరంలో అత్యంత అద్భుతంగా ఉంటుంది. చారిత్రాత్మకమైన భవనాలు..సాటిలేని సముద్ర తీరం.. సాయంత్రం వేళ విద్యుత్ కాంతులు.. ప్రత్యేకమైన హోటల్లు.. ఇతర షాపింగ్ మాల్స్ ఈ నగరానికి సరికొత్త అందాన్ని తీసుకొచ్చాయి. చికాగో నగరంలో రాత్రిపూట డౌన్ టౌన్ ఏరియాలో మామూలుగా నడిచినా కూడా అద్భుతంగా ఉంటుంది. ప్రతి మలుపులో పోస్ట్ కార్డు లాంటి అద్భుతమైన దృశ్యాలు కనిపిస్తాయి. చికాగో నగరం తర్వాత టోక్యో, న్యూయార్క్, మెల్ బోర్న్, సిడ్ని, హాంకాంగ్, టొరంటో, సింగపూర్, సియోల్, వాన్కోవర్ వంటి నగరాలు నైట్ లైఫ్ కు అత్యంత ప్రసిద్ధి చెందాయి.
ఒకప్పటి మాదిరిగా జనం లేరు. కోవిడ్ తర్వాత పూర్తిగా మారిపోయారు. ముఖ్యంగా ప్రపంచంలో వివిధ ప్రాంతాలను చూసేందుకు ఇష్టపడుతున్నారు. ఖర్చుకు ఏమాత్రం వెనకాడడం లేదు. తినే తిండి, తాగే నీరు, ఇలా ప్రతి విషయంలోనూ లగ్జరీ కోరుకుంటున్నారు. పైగా రొటీన్ జీవితం కాకుండా నైట్ లైఫ్ ఇష్టపడుతున్నారు. అందువల్లే ఈ ప్రాంతాలు ప్రపంచ ప్రఖ్యాతి సాధించాయి.