Homeఅంతర్జాతీయంJames Comey 8647: ట్రంప్‌పై హత్యా బెదిరింపు ఆరోపణలు.. జేమ్స్‌ కామీ ‘86 47’ పోస్ట్‌తో...

James Comey 8647: ట్రంప్‌పై హత్యా బెదిరింపు ఆరోపణలు.. జేమ్స్‌ కామీ ‘86 47’ పోస్ట్‌తో వివాదం

James Comey 8647: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై హత్యా బెదిరింపు ఆరోపణలతో మాజీ ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ జేమ్స్‌ కామీ వివాదంలో చిక్కుకున్నారు. కామీ ఇన్‌స్టాగ్రామ్‌లో ‘86 47’ అనే సంఖ్యలతో ఒక పోస్ట్‌ను పంచుకుని, తర్వాత డిలీట్‌ చేయడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఈ సంఖ్యలను 47వ అధ్యక్షుడైన ట్రంప్‌ను ‘86’ (అంటే తొలగించడం లేదా చంపడం) అనే రహస్య కోడ్‌గా అధికారులు, ట్రంప్‌ సన్నిహితులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై ట్రంప్‌ తీవ్రంగా స్పందిస్తూ కామీని ‘డర్టీ కాప్‌’గా అభివర్ణించారు. అమెరికా సీక్రెట్‌ సర్వీస్, ఎఫ్‌బీఐ ఈ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాయి. ఈ సంఘటన ట్రంప్‌ భద్రతపై మరోసారి ఆందోళనలను రేకెత్తించింది,

Also Read: తుర్కియే, అజర్‌బైజాన్‌లతో కటీఫ్‌.. వాణిజ్య బహిష్కరణ!?

మే 15, 2025న కామీ ఇన్‌స్టాగ్రామ్‌లో బీచ్‌లో షెల్స్‌తో ‘86 47’ సంఖ్యలను ఏర్పరిచిన చిత్రాన్ని ‘కూల్‌ షెల్‌ ఫార్మేషన్‌’ అనే క్యాప్షన్‌తో పోస్ట్‌ చేశారు. ఈ సంఖ్యలను ట్రంప్‌ మరణానికి పిలుపునిచ్చే కోడ్‌గా అధికారులు భావించారు, ఎందుకంటే ‘86’ అనేది అమెరికన్‌ స్లాంగ్‌లో ‘తొలగించడం’ లేదా ‘చంపడం’ అని సూచిస్తుంది, ట్రంప్‌ 47వ అధ్యక్షుడు. ఈ పోస్ట్‌ వైరల్‌ కావడంతో కామీ దాన్ని తొలగించి, ‘‘నేను ఈ సంఖ్యలను రాజకీయ సందేశంగా భావించాను. వీటిని హింసతో ముడిపెడతారని తెలియదు, నేను హింసకు వ్యతిరేకిని’’ అని స్పష్టీకరణ ఇచ్చారు. అయినప్పటికీ, ట్రంప్‌ ఈ వివరణను తోసిపుచ్చారు. ‘‘అతనికి దాని అర్థం తెలుసు, ఇది హత్యా పిలుపు’’ అని ఫాక్స్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

ట్రంప్‌ స్పందన..
ట్రంప్‌ కామీని తీవ్రంగా విమర్శిస్తూ, ‘‘అతను సమర్థుడు కాకపోవచ్చు, కానీ ఈ కోడ్‌ అర్థం తెలిసిన తెలివి ఉంది. అతను దేశాధ్యక్షుడిని చంపాలని పిలుపునిచ్చాడు’’ అని అన్నారు. హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ సెక్రెటరీ క్రిస్టీ నోమ్, ‘‘కామీ ట్రంప్‌ హత్యకు పిలుపునిచ్చాడు’’ అని ఆరోపిస్తూ, సీక్రెట్‌ సర్వీస్‌ దర్యాప్తును ప్రకటించారు. ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ కాష్‌ పటేల్‌ కూడా సీక్రెట్‌ సర్వీస్‌కు సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. మే 16, 2025న సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులు కామీని వాషింగ్టన్‌ ఫీల్డ్‌ ఆఫీస్‌కు తీసుకెళ్లి ప్రశ్నించారు, అయితే ఆయన అదుపులో లేరని, స్వచ్ఛందంగా సహకరిస్తున్నారని సీఎన్‌ఎన్‌ తెలిపింది.

ట్రంప్‌పై గత హత్యాయత్నాలు..
ట్రంప్‌ భద్రతపై ఆందోళనలు ఈ ఘటనతో మరింత పెరిగాయి, ఎందుకంటే 2024లో ఆయనపై రెండు హత్యాయత్నాలు జరిగాయి. జూలై 13, 2024న పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో ఎన్నికల ప్రచార ర్యాలీలో ఒక దుండగుడు కాల్పులు జరపగా, ట్రంప్‌ కుడి చెవికి గాయమైంది. సీక్రెట్‌ సర్వీస్‌ సత్వర స్పందనతో ఆయన ప్రాణాలు కాపాడబడ్డాయి. సెప్టెంబర్‌ 15, 2024న ఫ్లోరిడాలోని వెస్ట్‌ పామ్‌ బీచ్‌లో గోల్ఫ్‌ కోర్స్‌ వద్ద తుపాకీతో ఉన్న ఒక వ్యక్తిని భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. అదే విధంగా, ట్రంప్‌ హాజరైన ఒక సమావేశం సమీపంలో మాస్క్‌ ధరించిన సాయుధ వ్యక్తి అఓ–47 తుపాకీ, తూటాలతో పట్టుబడ్డాడని ఫాక్స్‌ న్యూస్‌ వెల్లడించింది. ఈ నేపథ్యంలో కామీ పోస్ట్‌ను అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు.

ట్రంప్‌–కామీ శత్రుత్వం
ట్రంప్, కామీ మధ్య శత్రుత్వం 2017లో ట్రంప్‌ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కొనసాగుతోంది. ట్రంప్‌ ఎన్నికల బృందం రష్యాతో సంబంధాలపై ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తున్న సమయంలో ట్రంప్‌ కామీని ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ పదవి నుంచి∙తొలగించారు. ఈ ఘటన తర్వాత కామీ ట్రంప్‌ను బహిరంగంగా విమర్శించడం, ట్రంప్‌ కామీని ‘డర్టీ కాప్‌’గా అభివర్ణించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కామీ ఇటీవల ‘ “FDR డ్రైవ్‌’ అనే నీతి నవలను ప్రచురించారు, ఇందులో ఒక ఫార్‌–రైట్‌ మీడియా వ్యక్తిత్వాన్ని లక్ష్యంగా చేసుకున్న కథాంశం ఉంది, దీన్ని కొందరు ట్రంప్‌తో ముడిపెడుతున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version