Angelina Jolie Leave Hollywood: అమెరికా అంటే భూతల స్వర్గం.. అవకాశాలకు నెలవు. ప్రపంచ వ్యాప్తంగా చాలామంది అమెరికా వెళ్లాలని కలలుగంటారు. అక్కడ అత్యున్నతమైన కొలువులు చేయాలని.. అక్కడ స్థిరపడాలని.. విలాసవంతమైన జీవితాన్ని గడపాలని భావిస్తుంటారు.. అమెరికా అత్యంత సంపన్నమైన దేశం కావడంతో నిబంధనలు కూడా అదే విధంగా ఉంటాయి. పైగా గత కొంతకాలంగా వీసాల విషయంలో అమెరికా అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పోటీ నెలకొన్న నేపథ్యంలో అమెరికా పౌరసత్వం అనేది చాలామందికి అందని ద్రాక్షగా మిగిలి పోతోంది. అమెరికాలో జీవనం ఇటీవల కాలంలో పూర్తిగా మారిపోయింది.
Also Read: ‘అగ్ని పరీక్ష’ లో అభిజిత్ ని మించిన తెలివైనోడు..దుమ్ములేపేసిన మనీష్!
కలల ప్రపంచం గా ఉన్న అమెరికాను వీడి వెళ్లిపోవడానికి చాలామంది సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. అమెరికాలో ఉండడం కంటే వేరే దేశాల్లోకి వెళ్లిపోవడం ఉత్తమం అనే పరిస్థితికి వారు వచ్చారు.. హాలీవుడ్ ప్రముఖులు రిచర్డ్ గేరే, ఎల్లెన్ డిజెనెరెస్, లోంగోరియా వంటి వారు వలస వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఇప్పుడు ఈ జాబితాలోకి హాలీవుడ్ ప్రముఖ నటి ఏంజెలీనా జోలి ఉన్నట్టు తెలుస్తోంది.. రాజకీయంగా అనిశ్చితి, నేరాలు జరుగుతున్న తీరు, ఆర్థికంగా భారం వంటి వాటి వల్ల హాలీవుడ్ ప్రముఖులు ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే హాలీవుడ్ ప్రముఖులు ఏ దేశాలలో స్థిరపడతారు.. ఏంజెలీనా జోలి ఎక్కడికి వెళ్తారు అనేది తెలియాల్సి ఉంది.
ఇటీవల కాలంలో అమెరికాలో రాజకీయంగా విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత పనికిమాలిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రపంచ దేశాల మీద ఆయన సుంకాలు విధిస్తున్నారు.. అమెరికాను గొప్పగా చేస్తానని చెప్పిన ఆయన అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నారు.. ఇటీవల కాలంలో అమెరికాలో నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. ప్రకృతి విపత్తులు కూడా విపరీతంగా చోటు చేసుకుంటున్నాయి. ఇవన్నీ కూడా స్వేచ్ఛ జీవనాన్ని అమెరికా ప్రజలకు దూరం చేస్తున్నాయి. అందువల్లే చాలామంది అమెరికాను వదిలిపెట్టి వెళ్లాలని భావిస్తున్నారు. అన్నిటికంటే నిరుద్యోగం అక్కడ తీవ్రంగా ఉంది. ఉద్యోగాలు లభించే పరిస్థితి లేకపోవడంతో చాలామంది యువత అవకాశాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. ఒకప్పుడు ప్రపంచ దేశాలకు ఉపాధి కేంద్రంగా ఉన్న అమెరికా ఇప్పుడు ఈ పరిస్థితి ఎదుర్కొంటుండడం ఊహించని తీరుగా మారిందని అంతర్జాతీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు..
“చూస్తుండగానే పరిస్థితి మారిపోయింది. ఇంకా ఎంతవరకు దిగజారుతుందనేది అర్థం కావడం లేదు. కాకపోతే ఇలాంటి దుస్థితి అమెరికా చవిచూస్తుందని కలలో కూడా ఊహించలేదు. రాజకీయంగా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. ఉద్యోగాల కల్పన విషయంలోనూ ఇలాంటిదే జరుగుతోంది. దీనివల్ల అమెరికా ఒత్తిడి ఎదుర్కొంటున్నది.. బహుశా అందువల్లే అమెరికాను వదిలి వెళ్లాలని చాలామంది అనుకున్నట్టు కనిపిస్తోందని” అంతర్జాతీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.