Homeఅంతర్జాతీయంIran US War: అమెరికా బెదిరింపులకు భయపడని ఇరాన్.. ఈసారి జోలికొస్తే నేలమట్టమే..

Iran US War: అమెరికా బెదిరింపులకు భయపడని ఇరాన్.. ఈసారి జోలికొస్తే నేలమట్టమే..

Iran US War: ఇరాన్ భయపడటం లేదు. అమెరికా హెచ్చరికలను లెక్కచేయడం లేదు. ఇజ్రాయిల్ బెదిరిస్తున్నప్పటికీ వెనుకడుగు వేయడం లేదు. ఇదే తీరు కొనసాగిస్తే అమెరికాకు, ఇజ్రాయిల్ కు తిరుగులేని స్థాయిలో బదులు ఇస్తామని హెచ్చరిస్తోంది.. ఇరాన్ ఈ స్థాయిలో తెగింపుకు దిగడానికి ఒక కారణం ఉంది. ఒకవేళ ఇరాన్ కనుక ఆ పని చేస్తే అమెరికా, ఇజ్రాయిల్ తీవ్రంగా ఇబ్బంది పడడం ఖాయం. ఇరాన్ మరింత స్థాయిలో తిరుగుబాటుకు దిగితే ఆ రెండు దేశాలు నేలమట్టం కావడం తథ్యం.

ఇప్పటికే అమెరికాకు సరైన స్థాయిలో బదులు ఇస్తోంది ఇరాన్. ఇజ్రాయిల్ దేశానికి కూడా అదే స్థాయిలో హెచ్చరికలు పంపిస్తోంది. ఇరాన్ ఈ స్థాయిలో హెచ్చరిక ఒక కారణం ఉంది. ఇరాన్ వద్ద యురేనియం నిల్వలు ఉన్నాయి. వాటిని న్యూక్లియర్ వెపన్స్ తయారీ కోసం, అవసరమైన 90 శాతం స్థాయికి శుద్ధి చేసే ప్రక్రియను చేస్తామని ఇరాన్ హెచ్చరిస్తోంది. ఇదే గనుక జరిగితే అమెరికాకు ఇబ్బంది తప్పదు. ఎందుకంటే తెగించిన వాడికి తెడ్డే లింగం అన్నట్టుగా.. ఇరాన్ గనుక న్యూక్లియర్ వెపన్స్ తో ఆ పని చేస్తే ప్రమాదకరమైన పరిణామాలు తప్పవు.

ఇప్పటికే ఇరాన్ పార్లమెంటరీ కమిషన్ ప్రతినిధి ఇబ్రహీం ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.. ” మా దేశం న్యూక్లియర్ ఆయుధాలు తయారు చేయకూడదని ట్రంప్ అనేకసార్లు చెప్పారు.. కానీ అమెరికా మాత్రం మా మీద దాడులు చేస్తోంది. మమ్మల్ని ఇబ్బంది పెడుతోంది. ఇలాంటప్పుడు మేము చూస్తూ ఎందుకు ఊరుకోవాలని” ఆయన స్పష్టం చేశారు.

ఇరాన్ దేశం గడచిన ఎన్ని సంవత్సరాలు కాలంలో 11వేల కిలోల అధిక స్థాయి యురేనియాన్ని సమకూర్చుకుంది. 2006లో యురేనియాన్ని సమకూర్చుకునే ప్రక్రియను ఇరాన్ అధికారికంగా ప్రారంభించింది. తనకు చుట్టూ శత్రు దేశాలు ఉండడంతో ఇరాన్ ప్రతి ఏడాది యురేనియం నిల్వలను పెంచుకుంటూ పోయింది. అమెరికా ఇప్పటివరకు భీకరమైన దానం చేసినప్పటికీ.. ఆ నిల్వలు ఎక్కడ ఉన్నాయో తెలియ రాలేదు. అయితే ఈ నిల్వలను ఇస్ప హాన్ అనే న్యూ క్లియర్ సెంటర్లో దాచి పెట్టిందని తెలుస్తోంది. న్యూక్లియర్ వెపన్స్ అత్యంత ప్రమాదకరమైనవి. వీటి ద్వారా దాడులు చేస్తే పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version