US Iran Conflict: ఇప్పట్లో అమెరికా మరో దేశం మీద దాడి చేయదు. యుద్ధానికి కాలు దువ్వదు. ఇంకో దేశం యుద్ధం చేస్తుంటే కనీసం సహాయం కూడా చేయదు. ఎందుకంటే ఇరాన్ ఆ స్థాయిలో అమెరికాకు పాఠాలు నేర్పింది.
Also Read: ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలు తప్పు.. వైసిపి చేసింది అంతకంటే తప్పు
అమెరికా రంగంలోకి దిగడంతో ఇజ్రాయిల్ పండగ చేసుకుంది. ఇరాన్ మీద దాడులు చేసింది. ఇరాన్ తుఫాన్ ముందు ప్రశాంతత లాగా కొద్ది రోజులు మౌనం పాటించింది. ఆ తర్వాత మొదలుపెట్టింది. దీపావళి పండుగ అంటే ఎలా ఉంటుందో అమెరికాకు.. ఇజ్రాయిల్ దేశానికి చూపించింది. ఇరాన్ దేశానికి హౌతి , హమాస్, హిజ్బుల్ల వంటి గ్రూపులు సహకరించడంతో.. యుద్ధంలో ఇరాన్ భీకర పాత్రను పోషించింది. వెన్ను చూపుతుంది అనుకుంటే.. మడమ తిప్పి పోరాటం చేసింది. ఇది అమెరికాకు మింగుడు పడలేదు. ఇజ్రాయిల్ దేశానికి అర్థం కాలేదు.
ఇజ్రాయిల్ ఇరాన్ దేశాన్ని వదిలిపెట్టి లెబనాన్ మీద దాడులు చేసింది. అయినప్పటికీ ఇరాన్ ఆగలేదు. ఇజ్రాయిల్ మీద ముప్పేట దాడి చేయడం మొదలుపెట్టింది. వాస్తవానికి ఇరాన్ దేశంలో న్యూక్లియర్ ప్లాంట్లు ఉన్నాయని.. రకరకాల ఆయుధ తయారీ కర్మాగారాలు ఉన్నాయని అమెరికా ఆరోపించింది. ఇజ్రాయిల్ దానిని సమర్థించింది. కానీ ఈ రెండు దేశాలు దాడులు చేసిన సరే.. ఇరాన్ దేశంలో ఇంకా కనిపించని వ్యవస్థలు ఉన్నాయని అంతర్జాతీయ మీడియా సంస్థల్లో వార్తలు వస్తున్నాయి. దీనిని బట్టి ఇరాన్ ముందుచూపును అర్థం చేసుకోవచ్చు.
ఇరాన్ మొండిఘటంగా తయారు కావడంతో అమెరికాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనేక విధాలుగా ఇరాన్ దేశాన్ని భయపెట్టాలని ప్రయత్నించాడు. ఇజ్రాయిల్ అండ చూసుకొని అడ్డగోలుగా మాట్లాడాడు. ప్రపంచ దేశాలను ఈ యుద్ధంలోకి లాగాలని ప్రయత్నించాడు. అయితే ట్రంప్ వ్యవహార శైలి తెలిసినా మిగతా దేశాల అధినేతలు నిశ్శబ్దంగా ఉన్నారు. ఏ కోణంలో కూడా ట్రంప్ తో సంప్రదింపులు జరపడానికి వారు ముందుకు రాలేదు. చివరికి భారత్ కూడా న్యూట్రల్ పాత్రకే పరిమితం కావడంతో అమెరికాకు కాళ్ళ కింద భూమి కంపించిపోయింది.
ఇరాన్ చేసిన దాడుల వల్ల అమెరికా గొప్పగా చెప్పుకునే ఎఫ్15 యుద్ధ విమానాలు కూలిపోయాయి. ఫైటర్ జెట్ లు నాశనమయ్యాయి. ఇంకా ఆత్మహుతి డ్రోన్లు నేల కూలిపోయాయి. ఇరాన్ మీద దాడి చేయడానికి అమెరికా.. ఇజ్రాయిల్ భారీగా ఖర్చు చేస్తే.. ఇరాన్ మాత్రం స్వదేశీ పరిజ్ఞానంతో స్వల్ప ఖర్చుతో తయారైన డ్రోన్ లను ఇజ్రాయిల్ మీదికి ప్రయోగించింది. అమెరికా, ఇజ్రాయిల్ దేశాల యుద్ధ విమానాలను నేల కూల్చింది. ఇటీవల అమెరికా దేశానికి సంబంధించిన అత్యున్నత రక్షణ రంగనిపుణుడు యుద్ధ విమానం కూలి పోవడంతో గాయపడ్డాడు. ప్రాణాలను కాపాడుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేశాడు. చివరికి అమెరికా రంగంలోకి దిగి.. అతడిని కాపాడుకోవాల్సి వచ్చింది. దీనిని బట్టి ఇరాన్ నైపుణ్యం.. ఇరాన్ యుద్ధ తంత్రం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇరాన్ నేర్పిన పాఠం అమెరికాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇరాక్ మాదిరిగా.. ఆఫ్ఘనిస్తాన్ మాదిరిగా.. వెనిజులా మాదిరిగా ఇరాన్ సరెండర్ కాలేదు. అందువల్లే అమెరికాకు ఈ పరిణామం మింగుడు పడక.. రెండు వారాల పాటు తాత్కాలిక కాల్పుల విరమణకు ఒప్పుకుంది.