Iran vs America war analysis: ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక శక్తి ఉన్న దేశం అమెరికా. ప్రపంచ పోలీస్‌గా చెలామణి అవుతోంది. ఆ దేశంతో యుద్ధానికి ఇతర దేశాలు భయపడతాయి. కానీ నిన్నటి వరకు ఇరాన్‌తో జరిగిన యుద్ధం అమెరికా లోపాలను బయటపెట్టింది. 40 రోజుల పాటు ఇరాన్ అమెరికాను తట్టుకుని నిలిచింది. సుప్రీం లీడర్ మరణించినా అమెరికా ఎయిర్ బేస్‌లు, యుద్ధ విమానాలపై ఇరాన్ దాడులు చేసి, కూల్చివేసింది. యుద్ధం ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేసిన లెక్కన్నీ తప్పని ఇరాన్ రుజువు చేసింది. ట్రంప్ అహంకారాన్ని అణచివేసింది.
ఆఫ్గాన్ చరిత్ర పునరావృతం..
ఆఫ్గానిస్తాన్‌ను ఆక్రమించుకుని 20 ఏళ్లపాటు యుద్ధం చేసి, చివరికి తాలిబాన్లతో ఒప్పందం చేసుకుని అమెరికా వెళ్లిపోయింది. నార్తర్న్ అలయన్స్‌ను బలపరచాలనుకుని, తాలిబాన్లను దెబ్బతీయాలనుకున్న అమెరికా వ్యూహం విఫలమైంది. ఇప్పుడు అమెరికా వెళ్లిపోయాక తాలిబాన్లు భారత్, రష్యా, చైనా మద్దతుతో పాకిస్తాన్‌పై యుద్ధానికి సిద్ధమయ్యారు. లిబియా, ఆఫ్గాన్, ఇరాన్ యుద్ధాలు ఒక దేశాన్ని లొంగదీసుకోవడం సాధ్యం కాదని నిరూపించాయి.
ఆధునిక యుద్ధ వ్యూహాల్లో ట్రంప్ విఫలం
ట్రేడ్ వార్‌తో కూడా ట్రంప్ ఏమీ సాధించలేదు. ఆధునిక యుద్ధ వ్యూహాలను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యాడు. ఇరాన్‌కు భారీ నష్టం కలిగించినా, వ్యూహాత్మక విజయం సాధించలేదు. ఎఫ్–35 వంటి అత్యాధునిక యుద్ధ విమానాలను భుజంపై మోసుకెళ్లే మిస్సైల్స్‌తో ఇరాన్ కూల్చివేసింది. యుద్ధ నౌకలను డ్రోన్లతో దెబ్బతీసింది. ఇప్పటి వరకు 30 అమెరికా యుద్ధ విమానాలు కూలిపోయాయి. చిన్న దేశం కూడా అత్యాధునిక ఆయుధాలను దెబ్బతీయగలదని ఈ యుద్ధం నిరూపించింది.
తక్కువ ఖర్చుతో నిలవురించిన ఇరాన్..
యుద్ధభూమిలో నిలిచి విజయం సాధించడం సులభం, కానీ వ్యూహాత్మకంగా పైచేయి సాధించడం కష్టం. హర్మూజ్ జలసంధిపై పట్టు సాధించాలనుకున్న ట్రంప్, ఇరాన్ దాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదని గ్రహించాడు. అసిమెట్రిక్ ఎండ్యూరెన్స్‌తో (అసమాన సహనశక్తి) ఇరాన్ అమెరికాను నిలువరించింది. యుద్ధాన్ని అనేక అంశాలు ప్రభావితం చేస్తాయని తేలింది.
అమెరికా ప్రజాస్వామ్యంపై ఇరాన్ ప్రభావం..
ఇరాక్ యుద్ధానికి జార్జ్ బుష్ కారణమైతే, ఇరాన్ యుద్ధానికి ట్రంప్ కారణం. అమెరికా ప్రజాస్వామ్యాన్నే ఇరాన్ ఆయుధంగా మార్చుకుంది. సొంత దేశంలోనే ట్రంప్‌పై వ్యతిరేకత పెరిగేలా చేసింది. చమురు సరఫరా నిలిపివేసి ప్రపంచ వ్యాప్తంగా అమెరికాపై ఒత్తిడి తెచ్చింది. గల్ఫ్ దేశాలపై దాడిచేసి అమెరికాపై నమ్మకం సడలేలా చేసింది. అమెరికన్లే యుద్ధాన్ని వ్యతిరేకించేలా చేయడంలో ఇరాన్ విజయం సాధించింది. మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ పార్టీ ఓడిపోతే మరింత ఇబ్బందులు ఎదురవుతాయని గ్రహించిన ట్రంప్ తాత్కాలిక విరామానికి తెరతీశాడు.
‘వార్ ఈజ్ నాట్ ఫార్ ఒన్లీ విత్ వెపన్స్, వార్ ఈజ్ నాట్ ఫిజికల్లీ, వార్ ఈజ్ ఫార్ జియోపొలిటికల్లీ, జియోఎకనామికల్లీ, ఎండ్యూరెన్స్‘ అనేది ఇరాన్–అమెరికా యుద్ధం నేర్పిన పాఠం. అమెరికా సైనిక శక్తిని ప్రదర్శించినా, వ్యూహాత్మకంగా ఓడిపోయింది. ఇరాన్ తక్కువ ఖర్చుతో అమెరికాను నిలువరించి, ప్రపంచానికి కొత్త యుద్ధ తత్వాన్ని చూపించింది. ఈ యుద్ధం అమెరికా ఏకపక్ష నిర్ణయం ప్రపంచానికి ఇబ్బందిగా మారింది.