Iran Attacks: ఇరాన్‌ను అణ్వస్త్ర రహిత దేశంగా చేయడంతోపాటు, అక్కడి ఆయిల్‌ను తమ అధీనంలోకి తెచ్చుకోవడమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌తో అమెరికా దాడులు మొదలు పెట్టింది. వారం దాటినా ఇరాన్ లొంగకపోవడం, ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ విచ్ఛిన్నం కావడంతో ఇప్పుడు అమెరికా నేరుగా యుద్ధరంగంలోకి దిగింది. ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా బీ2 బాంబులతో విరుచుకుపడింది. దీంతో ఇరాన్ ఇప్పుడ అమెరికాను టార్గెట్ చేసింది.
Also Read: కాంగ్రెస్‌కు భారత మ్యాప్ కూడా తెలియదా.. మన భూభాగాలను శత్రుదేశాల్లో కలిపేసిన వైనం!
ఇరాన్, మిడిల్ ఈస్ట్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై జూన్ 23న బహిరంగంగా క్షిపణి దాడులు చేసింది. ఖతర్, ఇరాక్, బహ్రెయిన్, కువైట్‌లలోని అమెరికా స్థావరాలను టార్గెట్ చేసిన ఈ దాడులను ఇరాన్ ‘బషాయర్ అల్–ఫత్‘ (విజయ శుభవార్త)గా పేర్కొంది. ఈ దాడులు అమెరికా ఇటీవల ఇరాన్ న్యూక్లియర్ సైట్లపై చేసిన దాడులకు ప్రతీకార చర్యగా జరిగినట్లు తెలుస్తోంది. ఖతర్‌లోని అల్–ఉదెయిద్ ఎయిర్ బేస్, ఇరాక్‌లోని అల్–అసద్ బేస్‌లపై దాడులు జరిగినట్లు అంతర్జాతీయ మీడియా నివేదించింది.
ఖతర్‌లో దాడి..
ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్లు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా కొట్టుకుంటూ.. ఇప్పుడు దాడి మాత్రం ఖతార్‌పై జరిగింది. ఆ దేశ రాజధాని దోహాలో పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు స్థానికులు తెలిపారు. అయితే, ఖతర్ రక్షణ శాఖ ప్రకారం, ఇరాన్ క్షిపణులను వారి గగన రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. దాడికి ముందు ఇరాన్ ఖతర్‌కు ముందస్తు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఈ దాడి ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నంగా భావించబడుతోంది. ఖతర్, బహ్రెయిన్, కువైట్, ఇరాక్ తమ గగనతలాలను తాత్కాలికంగా మూసివేశాయి, విమాన సేవలు నిలిచిపోయాయి.
పర్యవేక్షించిన ట్రంప్..
ఈ దాడులు మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలను మరింత పెంచాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రక్షణ మంత్రి, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఈ దాడులను వైట్‌హౌస్ సిట్యుయేషన్ రూమ్ నుంచి పర్యవేక్షించారు. అమెరికా సైనికులకు గాయాలు లేవని పెంటగన్ తెలిపింది. ఈ దాడుల తర్వాత చమురు ధరలు 4.7% పడిపోయాయి, ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్‌ను లక్ష్యంగా చేసుకోలేదనే ఊపిరితో ట్రేడర్లు ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేశారు.
డీ–ఎస్కలేషన్ అవకాశం?
ఇరాన్ దాడులు శక్తివంతంగా కనిపించినప్పటికీ, ముందస్తు హెచ్చరికలు, ఎటువంటి అమెరికా బాధితులు లేకపోవడం వంటివి ఈ దాడులు సంకేతాత్మకంగా, ఉద్రిక్తతలను తగ్గించే ఉద్దేశంతో జరిగినవిగా సూచిస్తున్నాయి. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్‌స్ ఈ దాడులను ‘అమెరికా నేరపూరిత చర్యలకు సమాధానం‘గా పేర్కొన్నప్పటికీ, ఖతర్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించినట్లు ఆ దేశం ఖండించింది. ఈ ఘటనలు ప్రాంతీయ సంఘర్షణ ఆందోళనలను పెంచినప్పటికీ, ఇరాన్, అమెరికా మధ్య చర్చలకు అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇరాన్ దాడులు మిడిల్ ఈస్ట్‌లో రాజకీయ, సైనిక ఉద్రిక్తతలను మరింత జటిలం చేశాయి. అయితే, ముందస్తు హెచ్చరికలు, ఖతర్ రక్షణ వ్యవస్థల విజయం, అమెరికా బాధితులు లేకపోవడం వంటివి ఈ దాడులు పెద్ద యుద్ధానికి దారితీయకపోవచ్చనే ఆశలను రేకెత్తిస్తున్నాయి. రాబోయే రోజుల్లో అమెరికా, ఇరాన్‌ల ప్రతిస్పందనలు ప్రాంతీయ శాంతిని నిర్ణయించనున్నాయి.
Also Read: తిరుమల : లడ్డూల కోసం వెయిటింగ్ ఉండదు ఇక.. ఇలా ఈజీగా తీసుకోవచ్చు