spot_img
Homeఅంతర్జాతీయంIran Gulf Europe Crisis: ఇరాన్ దెబ్బకు గల్ఫ్ యూరప్ దేశాల కూసాలు కదిలిపోతున్నాయి.. తాజాగా...

Iran Gulf Europe Crisis: ఇరాన్ దెబ్బకు గల్ఫ్ యూరప్ దేశాల కూసాలు కదిలిపోతున్నాయి.. తాజాగా ఏం చేశాయంటే

Iran Gulf Europe Crisis: మొదట్లో మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో యుద్ధం ప్రారంభమైనప్పుడు ఇజ్రాయిల్, అమెరికా ఇరాన్ మీద స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. ఇరాన్ ఆను పానుల మీద దెబ్బ కొట్టాయి. చివరికి ఇరాన్ ఈ యుద్ధంలో వెనుకడుగు వేస్తుందని.. అమెరికాకు.. ఇజ్రాయిల్ కు సరెండర్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ, ఇరాన్ తన మాస్టర్ బ్రెయిన్ వాడింది. తన సుప్రీం లీడర్ ఖమేనీ, ఇతర నాయకులను కోల్పోయినప్పటికీ.. మొండి ధైర్యంతో ముందడుగు వేసింది. చివరికి ఇజ్రాయిల్, అమెరికాకు చుక్కలు చూపిస్తోంది.

Also Read: అసెంబ్లీలో ‘గులాబీ’ ఫైట్: కెప్టెన్ కేసీఆర్ లేని గ్రౌండ్.. రేవంత్ ‘సిక్స్’ల పండగ!

అంతటి అమెరికా యుద్ధాన్ని ముగించడానికి అనేకదారులు వెతుకుతోందంటే ఇరాన్ ఏ స్థాయిలో ప్రతిదాడి చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఇజ్రాయిల్ పై కూడా ఇరాన్ నిప్పుల వర్షం.. బాంబుల మోత మోగిస్తున్న నేపథ్యంలో తట్టుకోలేకపోతోంది. చివరికి ఆ దేశ అధిపతి నెతాన్యహు “ఇది అత్యంత భయంకరమైన కాళరాత్రి” అని వ్యాఖ్యానించాడు అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇరాన్ కేవలం అమెరికా, ఇజ్రాయిల్ దేశాలకు మాత్రమే కాదు.. గల్ఫ్ దేశాలకు కూడా చుక్కలు చూపిస్తోంది. యూరోపియన్ యూనియన్ దేశాలకు కూడా సినిమా చూపిస్తోంది. దీంతో అటు గల్ఫ్ దేశాలు.. ఇటు యూరోపియన్ యూనియన్ దేశాలు దెబ్బకు నేలకు దిగివచ్చాయి. అమెరికాతో సంబంధం లేకుండా.. ఇజ్రాయిల్ దేశంతో మాటైనా చెప్పకుండా ఒక ప్రకటన చేశాయి. ఆ ప్రకటన కాస్త ఇప్పుడు మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో జరుగుతున్న యుద్ధాన్ని మరోవైపు తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

హర్ము జ్ జల సంధిలో సరుకు రవాణాను ఇరాన్ నిలిపివేసింది. దీంతో యూరప్ దేశాలకు చమురు.. గ్యాస్ సరఫరా పూర్తిగా తగ్గిపోయింది. ఫలితంగా అక్కడ దేశాలలో పరిస్థితి దారుణంగా మారిపోయింది. యూరప్ దేశాలలో గ్యాస్ వాడకం విపరీతంగా ఉంటుంది. ఒకసారిగా సరఫరా నిలిచిపోవడంతో అక్కడ ప్రజలు నరకం చూస్తున్నారు. అక్కడ ప్రభుత్వాలు ప్రజల నుంచి తీవ్రస్థాయిలో నిరసన ఎదుర్కొంటున్నాయి. ఒక కీలకమైన తీర్మానాన్ని గల్ఫ్ దేశాల సహకారంతో విడుదల చేశాయి.

“జల సంధి ని మూసి వేయడం సరికాదు. ఇరాన్ దళాలు సరుకు రవాణా స్వేచ్ఛగా జరగడానికి సహకరించాలి. ఇరాన్ తన బెదిరింపులు మానుకోవాలి. మందు పాతరలను ఏర్పాటు చేయడాన్ని విరమించుకోవాలి. డ్రోన్, క్షిపణి దాడులు చేయడం సరికాదు. ఐక్యరాజ్యసమితి భద్రత మండల తీర్మానం 2817 కు ఇరాన్ కట్టుబడి ఉండాలని” యూరోపియన్ యూనియన్, గల్ఫ్ దేశాలు పేర్కొన్నాయి.

ఈ తీర్మానం చేసిన దేశాలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ కింగ్ డం, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, జపాన్, కెనడా, నెదర్లాండ్స్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, స్లో వేకియా, లాట్వియా, డెన్మార్క్, న్యూజిలాండ్, ఫిన్లాండ్, నార్వే, స్వీడన్, స్లోవేనియా, ఎస్టోనియా, బహ్రేయిన్, లితువేనియా, ఆస్ట్రేలియా, సఖియా వంటి దేశాలు సంయుక్త ప్రకటన చేసిన వాటిలో ఉన్నాయి. ఇరాన్ ఒత్తిడి వల్ల ఈ దేశాలు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నా. ముఖ్యంగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. అందువల్లే ఈ దేశాలు చివరి అస్త్రంగా ఈ తీర్మానాన్ని చేసినట్టు తెలుస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version