Iran Attack On US Airbase: అమెరికా రాజేసిన యుద్ధాన్ని ఇరాన్ సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. ఇదే సమయంలో అమెరికా అనుకూల గల్ప్ దేశాలతోపాటు, ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులతో విరుచుకుపడుతోంది. గల్ఫ్‌దేశాల ఆయిల్, వాటర్ ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడులు చేస్తోంది. తక్కువ వ్యయంతో తయారు చేసిన ఆయుధాలు ప్రయోగిస్తూ అమెరికా, ఇజ్రాయెల్‌కు ఆర్థికంగా నష్టం కలిగిస్తోంది. ఇరాన్ డ్రోన్లను ఎదుర్కొనేందుకు ఆ దేశాలు పెద్దమొత్తంలో ఖర్చుచేసి తయారు చేసిన ఆయుధాలు వాడాల్సి వస్తోంది. ఈ రకంగా అమెరికాను ఇరాన్ దెబ్బకొడుతోంది. మరోవైపు హర్మూజ్ మూసి ఆయిల్ సంక్షోభం ద్వారా ప్రపంచ దేశాలు అమెరికాపై ఒత్తిడి చేసేలా చేయడంలో సఫలమైంది. ఇక అమెరికా బలం అనుకున్న ఎఫ్–35 స్టెల్త్ విమానాన్ని దెబ్బకొట్టింది. డిగా గోర్షియాలోని అమెరికా–యూకే ఎయిర్ బేస్‌పై మిస్సైల్ దాడి చేసి షాక్ ఇచ్చింది. తాజాగా ఇరాన్ సైన్యం సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్‌పై అధునాతన మిస్సైళ్లు, డ్రోన్‌లతో భారీ దాడి చేసింది.
అమెరికాకు తీవ్ర నష్టం..
ఈ దాడిలో 10 మంది అమెరికా సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అలాగే అమెరికాకు చెందిన ముగ్గురు కేసీ–135 రీఫ్యుయలింగ్ విమానాలు ఈ దాడిలో దెబ్బతిన్నాయి. యుద్ధం మొదలైన మూడు వారాల్లో మొత్తం 300 మంది అమెరికన్ సైనికులు ఇరాన్ దాడిలో గాయపడ్డారు, 13 మంది ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ అంతర్జాతీయ మీడియా తెలిపింది.
అర్ధరాత్రి తర్వాత ఎటాక్..
తాజాదాడి రాత్రి 2:30 గంటల సమయంలో జరిగింది, ఇరాన్‌కు చెందిన షెహాబ్–3 మిస్సైళ్లు, షాహెద్–136 డ్రోన్‌లు ఉపయోగించారు. బేస్‌లోని రన్‌వేలు, హ్యాంగర్లు విరిగాయి. గాయపడినవారు ప్రధానంగా ఎయిర్ వింగ్ సిబ్బంది. సౌదీ డిఫెన్స్ సిస్టమ్‌లు (ప్యాట్రియట్ మిస్సైళ్లు) 70% దాడులను అడ్డుకున్నా, మిగిలినవి దెబ్బ తీశాయి.
అమెరికా సైనికులపై ప్రభావం..
వరుస ఎదురుదెబ్బలు అమెరికా సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. యుద్ధం ప్రారంభం నుంచి 13 మంది సైనికులు మరణించారు. ఇరాన్ దాడిలో 8 మంది, ఇతర ఘటనలో ఐదుగురు చనిపోయారు. 300 గాయపడగా, 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రిన్స్ సుల్తాన్ బేస్ మధ్యప్రాచ్యంలో అమెరికా ఆపరేషన్లకు కీలకం. ఇక్కడ 5 వేల మంది అమెరికా సైనికులు ఉన్నారు. ఈ దాడి రక్షణ వ్యవస్థల బలహీనతలను,డ్రోన్ డిటెక్షన్ లోపాలు బహిర్గతం చేసింది. తాజా దాడితో పెంటాగాన్ ఈ బేస్ ఆపరేషన్లను తాత్కాలికంగా నిలిపింది.
ఈ ఘటన అమెరికా–ఇరాన్ ఘర్షణను మరింత తీవ్రతరం చేస్తుంది. సౌదీ మద్దతుతో అమెరికా ప్రతీకార దాడులు(ఎఫ్–35 స్ట్రైక్‌లు) ప్లాన్ చేస్తోంది. ప్రజల అసంతృప్తి 64 శాతానికి చేరింది, ఆయిల్ ధరలు 120 డాలర్లకు పైగా ఎదిగాయి. మిత్రరాజ్యాలు (ఇజ్రాయిల్, యూఏఈ) భద్రత ఆందోళనలు పెరిగాయి. దీర్ఘకాలంలో యుద్ధం అమెరికా ఆర్థిక వ్యవస్థకు 500 బిలియన్ డాలర్ల నష్టం కలిగించింది.