https://oktelugu.com/

Pakistan : సరిహద్దులు దాటిన మరో ప్రేమ.. ప్రేమించిన యువతి కోసం ప్రాణాలు పణంగా..!

ప్రేమ గుడ్డిది అంటారు. ప్రేమ ఎప్పుడు ఎలా.. ఎవరి మీద పుడుతుందో తెలియదు. అందుకే ప్రేమను గుడ్డిది అంటారు. ఇటీవల చాలా ప్రేమలు అవసరాల కోసం పుడుతున్నాయి. కానీ నేటికీ కొన్ని ప్రేమలు నిజాయతీని చాటుతున్నాయి. ప్రేమకు ఎల్లలు లేవని నిరూపిస్తున్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : January 1, 2025 / 11:23 AM IST

    Boy Love With Pakistan Girl

    Follow us on

    Pakistan :  ప్రేమ ఎవరిలో ఎప్పుడు ఎలా పుడుతుందో తెలియదు. ప్రేమకు హద్దులు ఉండవు. అందుకే భారతీయ యువకులు, యువతలను విదేశీయులు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. కొందరు ప్రేమ కోసం హద్దులు దాటి వస్తున్నారు. గతంలో పాకిస్తాన్‌కు చెందిన మహిళ మధ్దులు దాటి భారత్‌కు వచ్చింది. ఓ భారతీయుడు కూడా పాకిస్తాన్‌ వెళ్లాడు. ఇప్పుడు అలాంటిదే మరో ప్రేమ హద్దులు దాటి వచ్చింది. ఉత్తర ప్రదేశ్‌లోన అలీఘర్‌కు చెందిన బాబు తాను ప్రేమించిన పాకిస్తాన్‌ యువతి కోసం సరిహద్దులు దాటి నత ప్రాణాలు పణంగా పెట్టాడు.

    సోషల్‌ మీడియాలో ప్రేమ..
    బాబు సోషల్‌ మీడియాలో చూపి పాకిస్తాన్‌ యువతిని ప్రేమించాడు. తొలి చూపులోనేప్రేమలో పడ్డాడు. ఆ యువతి కోసం వీసా, పాస్‌పోర్టు లేకుండా సరిహద్దులు దాటేశాడు. ప్రస్తుతం బాబు పాకిస్తాన్‌ పోలీసుల అదుపులో ఉన్నాడు. సురక్షితంగా భారత్‌కు తీసుకురావడానికి ప్రభుత్వం సాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అలీఘర్‌ జిల్లా బార్లా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నాగ్లా ఖిత్కారీ గ్రామానికి చెందిన బాదల్‌ అలియాస్‌ బాబు సోషల్‌ మీడియాలో చూసి ఒక పాకిస్తాన్‌ యువతి ప్రేమలో పడ్డాడు. ఈ ప్రేమ కోసం పాకిస్తాన్‌ వెళ్లాని నిర్ణయించుకున్నాడు. సరైన పత్రాలు, వీసా లేకుండా సరిహద్దు దాటాడు. మోజామోంగ్‌ ప్రాంతంలో అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అరెస్టు చేశారు. ఈఘటన 2024, డిసెంబర్‌ 27న జరిగింది. విచారణలో బాబు అసలు విషయం చెప్పాడు.

    పత్రాలు లేకపోవడంతో…
    పాకిస్తాన్‌ మీడియా కథనం ప్రకారం.. పాకిస్తాన్‌ పోలీసులు వీసా, ఇతర పత్రాలు అడిగినప్పుడు ఏమీ చూపించలేదు. దీంతో అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఫొరినర్స్‌ యాక్ట్‌ 1946 సెక్షన్‌ 13, 14 కింద అరెస్టు చేశారు. బాబు గతంలో కూడా రెండుసార్లు భారత్‌–పాక్‌ సరిహద్దులు దాటే ప్రయత్నం చేశాడు. బాబును పాకిస్తాన్‌ పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. అక్కడ అతనికి 14 రోజుల జుడీషియల్‌ రిఆండ్‌ విధించారు. బాబు పాకిస్తాన్‌లోకి ప్రేమ కోసమే వచ్చాడా… లేక మరేదైనా ఉద్దేశంతో వచ్చాడా అని విచారణ జరుపుతున్నారు. అయితే ఈ విషయమై భారత్‌కు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదు.