Homeఅంతర్జాతీయంTrump impeachment: ట్రంప్‌పై అభిశంసన.. మహూర్తం ఫిక్స్‌

Trump impeachment: ట్రంప్‌పై అభిశంసన.. మహూర్తం ఫిక్స్‌

Trump impeachment: అగ్రరాజ్యం అమెరికాలో ఆ దేశ అధ్యక్షుడిపై ప్రజల్లో రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతోంది. ఏడాదిలోనే ట్రంప్‌ గ్రాఫ్‌ గతంలో ఎరికీ లేనంతగా పడిపోయింది. మరోవైపు న్యూయార్క్‌ మేయర్‌ ఎన్నికల్లో ట్రంప్‌ బలపర్చిన అభ్యర్థి ఓడిపోయారు. ఇక ట్రంప్‌ పాలనలో ఇప్పటికే నెలరోజులు షట్‌డౌన్‌ అయిన అమెరికా మరోమారు అదే ప్రమాదం అంచున ఉంది. ఈ నేపథ్యలో అమెరికా ప్రతినిధుల సభలో డెమోక్రాట్లు డొనాల్డ్ ట్రంప్‌పై మరో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. మార్చి 31 లోపు దీన్ని సాధించాలని ప్రణాళిక రూపొందించారు. అల్ గ్రీన్ వంటి నేతలు ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.

వ్యతిరేకతకు కారణాలు..
రెండో మారు అధికారంలోకి వచ్చిన ట్రంప్ చర్యలు, తీసుకుంటున్న నిర్ణయాలు, రూపొందిస్తున్న చట్టాలు ఏవీ ప్రజామోదయోగ్యంగా ఉండడం లేదు. అక్రమ వలసదారులపై దళాలు, మిన్నెసోటా కాల్పుల ఘటనలు హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ వైఫల్యాన్ని హైలైట్ చేశాయి. సుంకాల వల్ల ధరల ఆకాశంగమనం చిన్న వ్యాపారాలు, పౌరుల్లో అసంతృప్తి పెంచింది. మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నికైయ్యేందుకు ట్రంప్‌ ప్లాన్‌ చేస్తున్నారని, రాజ్యాంగం సవరించే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

రిపబ్లికన్ మద్దతు కోసం ప్రయత్నాలు
రిపబ్లికన్ ఆధిపత్య సభలో డెమోక్రాట్లు మెజారిటీ లేకపోవడంతో, పార్టీలోని ట్రంప్ వ్యతిరేకుల మద్దతు కోరుతున్నారు. ట్రంప్ చర్యలు స్వంత పార్టీలో కూడా అసహనాన్ని రేకెత్తిస్తోంది. దీంతో అభిశంసనకు రిపబ్లికన్‌ సభ్యులు మద్దతు ఇస్తారని భావిస్తున్నారు. ఈ అభిశంసనను 2026 మధ్యంతర ఎన్నికలకు ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. ట్రంప్ అధికారంతో ఎన్నికలపై ప్రభావం చూపించకుండా ఆపాలని భావిస్తున్నారు. మరోవైపు ట్రంప్ తన సపోర్టర్లను అప్రమత్తం చేస్తూ, మెజారిటీ కోల్పోతే ప్రతీకార చర్యలు తీసుకుంటారిని భావిస్తున్నారు.

ప్రతినిధుల సభలో తీర్మానం ఆమోదమైనా, సెనెట్‌లో రిపబ్లికన్ బలంతో ట్రంప్ పదవి కోల్పోయే అవకాశం తక్కువ. అయితే, ఈ రాజకీయ రచ్చ ట్రంప్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుంది. లేదా పార్టీలో చీలిక తెస్తుంది. మార్చి 31 డెడ్‌లైన్ ఒత్తిడి పెంచే ఎత్తుగడగానే కనిపిస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version