Homeఅంతర్జాతీయంCanada : ఉగ్రవాది అప్పగింతపై కెనడా చర్చలు.. ప్రకటించిన విదేశాంగ మంత్రి మెలానీ జోలీ!

Canada : ఉగ్రవాది అప్పగింతపై కెనడా చర్చలు.. ప్రకటించిన విదేశాంగ మంత్రి మెలానీ జోలీ!

Canada :  భారత్‌, కెనడా మధ్య కొన్ని రోజులుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి తయారైంది. మరో పాకిస్తాన్‌లా కెనడా వ్యవహరిస్తోంది. భారత్‌ను అంతర్జాతీయంగా దోషిగా నిలబెట్టాలని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఓ ఉగ్రవాది హత్యకు భారత్‌ను బాధ్యులను చేస్తున్నాడు. హత్యకు గురైన వ్యక్తి సిక్కు మతానికి చెందినవాడు కావడం, కెనడాలో సిక్కులు ఎక్కువగా ఉండడంతో 2025లో జరిగే ఎన్నికల్లో సిక్కుల మద్దతు పొందేందుకు ట్రూడో చీప్‌ ట్రిక్స్‌ ప్లే చేస్తున్నారు. నిజ్జర్‌ హత్యకు భారత ఏజెంట్లు కారణమని గతేడాది ఆరోపించారు. దీనికి ఎలాంటి ఆధారాలు చూపలేదు. ఇక రెండు నెలల క్రితం మరోమారు హత్య నెపాన్ని భారత్‌పై వేయడంతోపాటు భారత విదేశీ కార్యదర్శులను అరెసు‍్ట చేయాలని భావించారు. పరిస్థితిని గమనించిన భారత్‌ వెంటనే మన రాయబారులను వెనక్కి పిలిచింది. భారత్‌ని కెనడా రాయబారులను బహిష్కరించింది. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా క్షిణించాయి. తర్వాత న్యూయార్క్‌ టైమ్స్‌కు నిజ్జర్‌ హత్యకు సంబంధించిన వివరాలు అందించి భారత్‌ను దోషిగా చూపేలా కథనం ప్రచురించేలా చేసింది. దీంతో కెనడా వెనుక అమెరికాతోపాటు భారత ఎదుగుదలను ఓర్వలేని దేశాలు ఉన్నట్లు అర్థమైంది.

మరో ఉగ్రవాది అరెస్ట్‌..
ఇదిలా ఉంటే.. కెనడా పోలీసులు ఖలిస్తానీ వేర్పాటువాది అర్షదీప్‌ సింగ్‌ అలియాస్‌ అర్ష్‌ దల్లాను అరెస్టు చేశారు. అతడిని తమకు అప్పగించాలని భారత్‌ ఇటీవలే కెనడాను కోరింది. ఈ విషయమై కెనడా విదేశాంగ శాఖ మంత్రి మోలానీ జోలీ స్పందించారు. ఉగ్రవాదిని అప్పగంచే విషయమై భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌తో చర్చిస్తున్నట్లు వెల్లడించారు. పెరూలోని లిమాలో శుక్రవారం జరిగిన ఆసియా-పసిఫిక్‌ ఆర్థిక సహకార వార్షిక మంత్రివర్గ సమావేశంలో మెలానీ జోలీ మాట్లాడారు. అర్ష్‌ దల్లా కేసులో విచారణ జరగుతోందని తెలిపారు. అతడిని ఏమైనా విచారణ చేయాల్సి ఉంటే భారత దౌత్యవేత్తలతో మాట్లాడుతామని పేర్కొన్నారు.

కాల్పుల ఘటనలో నిందితుడు..
ఇదిలా ఉంటే అర్ష్‌ దల్లా అకో‍్టబర్‌ 27, 28 తేదీల్లో మిల్టన్‌ పట్టణంలో జరిగిన కాల్పుల ఘటనలో నిందితుడిగా ఉన్నట్లు కెనడా ఇన్‌ఫర్మేషన్‌ ఏజెన్సీలు గుర్తించారు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. పంజాబ్‌లోని మోగా జిల్లాకు చెందిన దల్లాపై భారత్‌లో హత్య, వేధింపులు, అపహరణతోపాటు పలు కేసులు ఉన్నాయి. గతేడాది జనవరిలో భారత ప్రభుత్వం దల్లాను ఉగ్రవాదిగా ప్రకటించింది. డ్రగ్స్‌, ఆయుధాల స్మగ్లింగ్‌లోనూ ఇతడి పాత్ర ఉన్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. దల్లాకు సంబంధించిన పలు కేసులను జాతీయ విచారణ సంస్థ దర్యాప్తు చేస్తోంది. ఇక హత్యకు గురైన నిజ్జర్‌కు దల్లా స్నేహితుడు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version