Don’t give jobs to Indians: ఇండియా లేకపోతే అమెరికా లేదు.. మూడు దశాబ్దాలక్రితం బిల్‌క్లింట్ అన్న మాటలివీ. ఇండయిన్ ఐటీ నిపుణుల కారణంగా అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పుడు ఎన్నో కంపెనీలు కొనసాగుతున్నాయి. లక్షల బిలియన్ డాలర్లు ఆర్జిస్తున్నాయి. ఇండియన్ ఐటీ నిపుణులకు అమెరికాలో మంచి డిమాండ్ ఉంది. ఐటీ కంపెనీలు కూడా ఇండియాలో రిక్రూట్ చేసుకుని కంపెనీ వీసాపై అమెరికాకు తీసుకెళ్లి ఆక్కడ పని చేయించుకుంటున్నాయి. అయితే మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ నినాదంతో అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్.. తలతిక్క నిర్ణయాలతో అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. వీసా ఆంక్షలు, అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, సోషల్ మీడియాపై ఆంక్షలు, యూనివరి‍్సటీలపై ఆంక్షల కరాణంగా విదేశీయుల డాలర్ డ్రీం కరిగిపోతోంది. తాజాగా ట్రంప్ భారత ఉద్యోగులపై ఉన్న వ్యతిరేకతను బయట పెట్టారు. కొత్తగా భారతీయులకు జాబ్స్ ఇవ్వొద్దని ఐటీ కంపెనీలను ఆదేశించారు.
ఏఐ సదస్సులో కీలక సందేశం..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్ డీసీలో జరిగిన ఏఐ సదస్సులో మాట్లాడారు. భారతీయులకు అమెరికాలోని ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు ఇవ్వొద్దని ఆదేశించారు. ఇదే మసయంలో చైనాలో కంపెనీలు పెట్టడం ఆపాలని సూచించారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి భారీ టెక్ కంపెనీలు భారతీయుల నియామకం నిలిపివేయాలని ఆదేశించారు. టెక్ సంస్థల గ్లోబలిస్ట్ వైఖరిని ఆయన తీవ్రంగా విమర్శించారు. అమెరికన్ స్వేచ్ఛను ఉపయోగించుకుని విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం, భారత్, చైనా దేశాల ఉద్యోగులను నియమించడం వంటి చర్యలు అమెరికన్ పౌరులలో అసంతృప్తిని కలిగించాయని పేర్కొన్నారు. అమెరికన్ టెక్ కంపెనీలు గతంలో “రాడికల్ గ్లోబలిజం”ను అనుసరించాయని, దీని వల్ల అమెరికన్ పౌరులు నిర్లక్ష్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు. చాల సంస్థలు అమెరికన్ స్వేచ్ఛను దుర్వినియోగం చేశాయన్నారు. “సిలికాన్ వ్యాలీలో దేశభక్తి, జాతీయ విధేయత” అవసరమని, అమెరికన్ టెక్ కంపెనీలు “అమెరికాకు మొదటి ప్రాధాన్యం” ఇవ్వాలని ఆదేశించారు.
Also Read: థాయ్‌లాండ్-కంబోడియాల మధ్య యుద్ధం ఎందుకు మొదలైంది?
ఆ కంపెనీల సీఈవోలు భారతీయులే..
ఇక్కడ విశేషం ఏమిటంటే ట్రంప్ ఆదేశించిన దిగ్గజ టెక్ కంపెనీలు గూగుల్, మైక్రోసాఫ్ట్ సీఈవోలు భారత సంతతికి చెందనవారే. సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల ఈ కంపెనీలకు సీఈవోలుగా ఉన్నారు. వీరి కారణంగానే ఈ కంపెనీలు గణనీయమైన లాభాలు ఆర్జిస్తున్నాయి. కానీ, ట్రంప్ భారతీయులనే నియమించుకోవద్దని ఆదేశించడం ఆ దేశానికే నష్టం కలిగించే అవకాశం ఉంది. ఆడ రాక.. గ్రౌండ్ చిన్నగా ఉందన్నాడట వెనుకటికి ట్రంప్ లాంటివాడే. అమెరికా యువకుల్లో టాలెంట్ లేకనే కంపెనీలు విదేశీయులను నియమించుకుంటున్నాయి. ఇదే సమయంలో అమెరికాలో ఒక ఉద్యోగికి ఇచ్చే వేతనంతో భారత్‌కు చెందిన ముగ్గురు ఐటీ నిపుణులను నియమించుకోవచ్చు. అయినా ట్రంప్ మాత్రం.. అమెరికన్లనే నియమించాలని మొండిగా ఆదేశాలు జారీ చేశారు.
భారతీయ ఐటీ రంగంపై ప్రభావం..
ట్రంప్ వ్యాఖ్యలు, ఆదేశాలు భారతీయ ఐటీ నిపుణులు, ఔట్‌సోర్సింగ్ సంస్థలపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. భారతదేశం గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి అమెరికన్ టెక్ కంపెనీలకు ఒక ప్రధాన ఔట్‌సోర్సింగ్ కేంద్రంగా ఉంది, ఇక్కడ లక్షలాది ఐటీ నిపుణులు ఉద్యోగాలు చేస్తున్నారు. ట్రంప్ విధానాలు అమలైతే, ఈ రంగంలో అనేక సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది.