Homeఅంతర్జాతీయంAmerica Secret Weapon: వెనెజువెలాపై నిషేధిత ఆయుధం ప్రయోగం.. నిబంధనలు ఇతర దేశాలకేనా ట్రంపూ!

America Secret Weapon: వెనెజువెలాపై నిషేధిత ఆయుధం ప్రయోగం.. నిబంధనలు ఇతర దేశాలకేనా ట్రంపూ!

America Secret Weapon: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ప్రపంచ యుద్ధాలు ఆపేస్తామని ప్రకటించారు. కానీ, యుద్ధాలు ఏమీ ఆగలేదు. మరోవైపు ట్రంప్‌ ప్రపంచంలోని తనకు అవసరమైన దేశాలను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్‌ మదురోను కిడ్నాప్‌ చేయించాడు. గ్రీన్‌లాండ్‌పై కన్నేశారు. మరోవైపు ఇరాన్‌పై దాడికి సిద్ధమవుతున్నాడు. అయితే వెనెజువెలాపై ఆపరేషన్‌ విజయవంతం కావడంతో ట్రంప్‌లో అహకంరం మరింత పెరిగింది. ప్రపంచంలో ఏ దేశంపైన అయినా దాడి చేస్తామని వార్నింగ్‌ ఇస్తున్నాడు.

వెనెజువెలాపై సైలంట్‌ ఆపరేషన్‌..
అమెరికా ఆధారాలు లేకుండా వెనెజువెలా నేత నికోలస్‌ మదురోను ఆకస్మికంగా అరెస్ట్‌ చేసినట్లు సంచారం. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా జరిగిన ఈ ఆపరేషన్‌ ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు రేపింది. వెనెజువెలా రక్షణ బలగాల ఆయుధ వ్యవస్థలను పూర్తిగా అచంచలం చేసి, మదురోను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో మదురో చెవి, ముక్కు నుండి రక్తస్రావం కావడం అనేక అనుమానాలకు కారణమైంది.

రహస్య ఆయుధాలు..
ఈ ఆపరేషన్‌లో అమెరికా రహస్యంగా అభివృద్ధి చేసిన అజ్ఞాత ఆయుధాలను ఉపయోగించినట్లు అనుమానం. ఈ ఆయుధాలు అతి వేగవంతమైన వాహనాల రూపంలో ఉండి, ఎవరికీ తెలియకుండా లక్ష్యాలకు చేరుకుంటాయి. వీటిలో అధిక శక్తి లేజర్‌ వ్యవస్థలు, మైక్రోవేవ్‌ టెక్నాలజీలు ఉన్నాయి. ఇవి ఆలైట్‌ వేగంతో దాడి చేసే సామర్థ్యం కలిగి ఉంటాయి. ఎనర్జీ ఆధారిత ఈ ఆయుధాలు సాంప్రదాయిక ఆయుధాలను అధిగమిస్తూ, శత్రు రాడార్లను అంధకారం చేస్తాయి. అంతర్జాతీయ ఒప్పందాల్లో నిషేధించినా అమెరికా ఇవి రహస్యంగా పరీక్షిస్తూ తయారుచేస్తోందని విమర్శకులు ఆరోపిస్తున్నారు.

గ్లోబల్‌ భద్రతపై ఆందోళన..
ఈ రకం ఆపరేషన్లు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించే ప్రమాదకరమైన మార్గాలను సూచిస్తాయి. మదురో అరెస్ట్‌ వెనెజువెలాలో అంతర్గత కలహాలను పెంచవచ్చు, లాటిన్‌ అమెరికాలో అమెరికా ప్రభావాన్ని బలోపేతం చేస్తుంది. రహస్య ఆయుధాల ఉపయోగం ఇతర దేశాల్లో ఆందోళనలను రేకెత్తించి, ఆయుధ నియంత్రణ చర్చలకు కొత్త ఊపిరి పోస్తుంది. అయితే, ఈ సంఘటన నిజాలు బయటపడితే, దాని ఆధారంగా ప్రపంచ రాజకీయాలు మారవచ్చు. ఇది సైబర్, ఎనర్జీ యుద్ధాల యుగాన్ని ప్రారంభిస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular