ఢిల్లీ, కోల్ కతా మ్యాచ్ సందర్భంగా మైదానంలో గొడవ జరిగింది. ఢిల్లీ ఆటగాడు అశ్విన్, కోల్ కతా కెప్టెన్ మోర్గాన్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆఖరి ఓవర్లో సౌథీ బౌలింగ్ లో ఔటై వెళ్లిపోతున్న అశ్విన్ ను మోర్గాన్ ఏదో అనడంతో ఆగిపోయాడు. కోపంగా స్పందిస్తూ మోర్గాన్ దిశగా వెళ్లాడు. అయితే కోల్ కతా వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ అతణ్ని ఆపి శాంపింప చేశాడు.

అయితే ఈ ఘటనపై దినేష్ కార్తీక్ స్పందించాడు. 19 వ ఓవర్ లో బంతి పంత్ను తాకిన తర్వాత కూడా రెండో పరుగు తీయడం క్రీడాస్ఫూర్తిని విస్మరించడం వంటిదేనని భావించి, మోర్గాన్ కలుగజేసుకున్నాడని తెలిపాడు. ఇలాంటి సందర్భాల్లో బ్యాటర్ చేసిన పని గురించి చర్చించాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చాడు. అయితే కేవలం ఇది తన అభిప్రాయం మాత్రమే అని దినేశ్ కార్తిక్ స్పష్టం చేశాడు. ఏదేమైనా.. తన జోక్యం వల్ల గొడవ సద్దుమణిగినందుకు సంతోషంగా ఉందని, ఇప్పుడు అంతా సర్దుకుందని పేర్కొన్నాడు. రాహుల్ త్రిపాఠి బంతి విసిరాడు. అది రిషబ్ పంత్ ను తాకి.. కిందపడింది. ఇంతలో అశ్విన్ పరుగు కోసం పంత్ ను ఆహ్వానించాడు.
ఇద్దరూ పరుగు తీశారు. అయితే మోర్గాన్ కు ఇది నచ్చలేదు. నిజానికి బాల్ బ్యాటర్ లేదంటే ప్యాడ్ ను తాకిన తర్వాత పరుగు తీయడం సరికాదు. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధం అని అతడు భావిస్తాడు అందేకే ఇదంతా అని కోల్ కతా నైట్ రైడర్స్ క్రికెటర్ దినేశ్ కార్తిక్ మంగళవారం నాటి మ్యాచ్ ను సంబందించిన గొడవ గురించి వివరించాడు. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ 3 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.