China Space Solar Power Station: చైనా(Chaina) అభివృద్ధిలో వేగంగా ఎదుగుతోంది. జనాభాలో రెండో స్థానంలో ఉన్న చైనా, ఆర్థికాభివృద్ధిలో మూడో స్థానంలో ఉంది. మొదటిస్థానమే లక్ష్యంగా అనేక ప్రయత్నాలు చేస్తోంది. అంతరిక్ష ప్రయోగాల్లోనూ సొంతంగా అనేక నూతన విషయాలను ప్రపంచానికి తెలియజేస్తోంది. చంద్రుడిపై నుంచి మట్టిని తీసుకువచ్చి నీరు ఉన్నట్లు గుర్తించింది. ఇలా అనేక రంగాల్లో వేగంగా ప్రగతి సాధిస్తోంది. తాజాగా మరో భారీ ప్రాజెక్టు(Project) చేపట్టే దిశగా అడుగులు వేస్తోంది. సౌరశక్తిని సమర్థవంతంగా వినియోగించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తోంది.
నింగిలో సోలార్ ప్లాంట్..
త్రీగోర్జెస్ డ్యామ్ చైనా చరిత్రలో ఓ కలికితురాయి. మానవులు సృష్టించిన అతిపెద్ద నీటి నిల్వ కట్టడం. అంతరిక్షం నుంచి కనిపించే కొన్నింటిలో ఈ డ్యాం ఒకటి. ఇదే తరహాలో ఇప్పుడు సోలార్ ప్లాంట్ నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తోంది. సౌరశక్తిని ఒడిసిపట్టేలా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సిద్ధమవుతున్నట్లు ప్రముఖ రాకెట్ సైంటిస్ట్ లాంగ్ లెహావోను ఉటంకిస్తూ సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది. నేల నుంచి 32 వేల కిలోమీటర్లల ఎత్తులో భూస్థిర కక్ష్యలో కిలోమీటర్ విస్తీర్ణంలో ఈ భారీ సోలార్(Solar) ప్లాంట్ నిర్మించాలని భావిస్తోంది. దీంతో భూవాతావరణంలో మార్పులు, రాత్రి, పగలుతో సంబంధం లేకుండా సౌరశక్తిని సేకరించే వీలు కలుగుతుంది. ఈ ప్రాజెక్టును లాంగ్‌హావో త్రీగోర్జెస్ డ్యామ్‌తో పోల్చారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కోసం పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ పద్ధతిలో ఒక ఏడాదిలో ఉత్పిత్త అయ్యే శక్తి భూమి లోపలి నుంచి తవ్వితీసే మొత్తం చమురు నిల్వల నుంచి ఉత్పత్తి అయ్యే శక్తితో సమానమని తెలిపారు.
అతిపెద్ద జల విద్యుత్ కేంద్రం..
చైనాలోని యాంగ్జీ నదిపై త్రీగోర్జెస్ డ్యామ్ నిర్మించింది చైనా. ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్(Hidal power) కేంద్రం కూడా ఇక్కడే ఉంది. ఈ డ్యామ్‌లో 22,500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఇది ప్రపచంలోనే అతిపెద్దవైన మూడు అణువిద్యుత్ కేంద్రాల ఉత్పత్తికి సమానం. ఇందులో నీటినిల్వ బరువుకు భూపరిభ్రమణ వేగం 0.06 మైక్రో సెకన్లు తగ్గిందని నాసా వెల్లడించింది. ఇప్పుడు అతిపెద్ద సౌర విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
మరో భారీ ప్రాజెక్టు..
ఇదిలా ఉంటే.. చైనా భారత్‌కు సమీపంలో యార్గంగ్ జంగోబ్‌గా ప్రసిద్ధమైనా బ్రహ్మపుత్ర(Bhrmaputra) నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకు ఇటీవలే ఆమోద ముద్ర వేసింది. ఇందుకు 137 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని లెక్కలు వేసింది. దీని సాయంతో చైనా బ్రహ్మపుత్ర నది ప్రవాహాన్ని నియంత్రించాలనుకుంటోంది. భారీ మోతాదులో వరద నీటిని భారత భూభాగంపైకి వదిలి విధ్వంసం సృషఫ్టించే వీలు చైనాకు కలుగుతుంది.