China online food delivery workers: చైనాలో ఏం జరిగినా సరే ప్రపంచానికి కాస్త ఆలస్యంగా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ప్రభుత్వ మీడియా మాత్రమే ఉంటుంది. చైనా ప్రభుత్వ అనుకూల వార్తలు మాత్రమే అక్కడ ప్రసారమవుతూ ఉంటాయి.. ప్రభుత్వానికి సంబంధించిన ఒక్క వ్యతిరేక వార్త కూడా బయటి ప్రపంచానికి తెలియదు. సోషల్ మీడియా మీద కూడా ఒక కన్ను ఉంటుంది. అందువల్లే అక్కడ ప్రజలు ఎటువంటి విషయాన్ని కూడా బయటికి పంచుకోవడానికి ఇష్టపడరు.. చివరికి చైనాలో భారీ వర్షాలు కురిసి.. విపరీతంగా నష్టం వాటిల్లితేనే రోజుల తర్వాత ఆ వార్త బయటకు తెలుస్తుంది. అంతటి కఠినమైన నిఘా చైనా దేశంలో ఉంటుంది.
చైనాలో కొంతకాలంగా అక్కడి గిగ్ వర్కర్లు తెగ తిప్పలు పడుతున్నారు. చేతిలో ఫోన్ పట్టుకొని తెగ గీకేస్తూ ఉన్నారు. దీని వెనక కారణం లేకపోలేదు. చైనాలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు చాలానే ఉంటాయి. కాకపోతే అక్కడ ఫుడ్ డెలివరీ చేయడానికి చాలామంది ఉంటారు. అయితే ఫుడ్ ఆర్డర్లు పెట్టుకునేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందువల్లే ఆర్డర్ కోసం అక్కడి వర్కర్లు తెగ తిప్పలు పడుతుంటారు. ఆర్డర్ రాగానే వెంటనే తమకే దక్కే విధంగా ఫోన్ అరచేతులలో పట్టుకొని పదేపదే గీకుతూ ఉంటారు. షాంగై నుంచి మొదలు పెడితే బీజింగ్ వరకు ఇదే పరిస్థితి.
మనదేశంలో అయితే అలా ఉండదు ఫుడ్ డెలివరీ చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటే.. ఫుడ్ ఆర్డర్ పెట్టే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అందువల్లే ఫుడ్ ఆర్డర్ పెట్టగానే.. వెంటనే డెలివరీ సంస్థలు యాక్సిస్ చేయలేవు. యాక్సిస్ చేసిన తర్వాతనే ఫలనా సమయానికి ఇస్తామని ఆ కంపెనీ సందేశం పంపుతుంది. మనదేశంలో గిగ్ వర్కర్లు చాలామంది ఉన్నారు. అయితే వారికి మించిన స్థాయిలో ఆన్లైన్లో చాలామంది ఆర్డర్లు పెడుతుండడంతో కొన్ని సందర్భాలలో సరైన సమయానికి ఆహారం డెలివరీ కాదు.
ఇటీవల కాలంలో మనదేశంలో ఇంట్లో వండడం తగ్గిపోయింది. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తుంటే కచ్చితంగా వారు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటున్నారు. కేవలం ఫుడ్ మాత్రమే కాదు.. గ్రాసరీ నుంచి మొదలు పెడితే ఫ్రూట్స్ వరకు అన్ని ఆన్లైన్ లోనే ఆర్డర్ పెడుతున్నారు. చైనా ఈ స్థాయిలో డెవలప్ అయినప్పటికీ.. ప్రపంచ రెండవ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నప్పటికీ అక్కడి ప్రజలు ఇంటి వంటకే ప్రాధాన్యమిస్తున్నారు. వాళ్లకు మనకు ఎంత తేడా ఉందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.
చైనా దేశ ప్రజలు ఇంట్లో వంటకాలకే ప్రాధాన్యం ఇస్తారు. బయట తిండిని సాధ్యమైనంతవరకు ఇష్టపడరు. కాకపోతే కరోనా సమయంలో చైనా దేశ ప్రజలు తినే తిండి మీద రకరకాల విమర్శలు వచ్చినప్పటికీ.. అక్కడ దేశ ప్రజల ఆహారపు అలవాట్లు అలా ఉంటాయి. శతాబ్దాలుగా అక్కడి ప్రజలు అలానే తింటూ ఉంటారు. కాకపోతే కొంతమందికి ఇది నచ్చదు. వారు ఎలా తిన్నా సరే ఇంట్లోనే వండుకుంటారు. బయట తిండి చాలా పరిమితంగా తీసుకుంటారు.. కానీ మనదేశంలో అలా కాదు. ఇంట్లో వండడం తక్కువ.. బయట తినడం ఎక్కువ.. అందువల్లే ఈ స్థాయిలో రోగాలు వస్తున్నాయి.
