https://oktelugu.com/

Chandrababu: వారు రిచ్.. మేం పూర్.. ఆ రెండు రాష్ట్రాలపై నోరు పారేసుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు( Chandrababu) అదును చూసి మాట్లాడతారు. చురకలు వేస్తారు. ఇప్పుడు ఆయన రెండు రాష్ట్రాలపై అటువంటి వ్యాఖ్యలే చేశారు.

Written By: , Updated On : January 23, 2025 / 04:35 PM IST
Chandrababu

Chandrababu

Follow us on

Chandrababu: దావోస్ లో( davos ) ప్రపంచ పెట్టుబడుల సదస్సు కొనసాగుతోంది. తమ రాష్ట్రాలకు పెట్టుబడులు ఆకర్షించడానికి దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఒకే వేదిక పైకి వచ్చారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి. వీరికి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫాద్నా వీస్ తోడయ్యారు. అయితే ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు రోజుల కిందట సీఎం చంద్రబాబు నేతృత్వంలోని బృందం దావోస్ పర్యటనకు వెళ్ళింది. ఈ బృందంలో మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ సైతం ఉన్నారు. అదే సమయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఒక బృందం సైతం దావోస్ వెళ్ళింది. అయితే ఇరు తెలుగు రాష్ట్రాలు.. పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేశాయి. ప్రపంచ దిగ్గజ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రిలు సమావేశం అయ్యారు. అయితే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర పట్నవిస్ నేతృత్వంలో బృందం సైతం వచ్చింది.

* ఆత్మీయ పలకరింపులు
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు మహారాష్ట్ర సీఎం కలిశారు. కలిసి ఫోటోలకు దిగారు. ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు( Chandrababu) కీలక వ్యాఖ్యలు చేశారు. వారు ధనిక రాష్ట్రాల వారు అని.. తమది పేద రాష్ట్రమని చంద్రబాబు చేసిన కామెంట్స్ ఆసక్తిగా మారాయి. వాళ్లు వెరీ రిచ్.. మేం వెరీ పూర్ అంటూ.. ఆ రెండు రాష్ట్రాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు చంద్రబాబు.

* ఒకే వేదికపై ముగ్గురు సీఎంలు
దావోస్ లో నిర్వహించిన కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్( country strategic dialogue ) సమావేశానికి ముగ్గురు ముఖ్యమంత్రులు హాజరయ్యారు. దేశం ఒక యూనిట్ గా పెట్టుబడులు రాబట్టేలా కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. కార్యక్రమంలో గ్రీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ, రక్షణ రంగంలో పెట్టుబడులకు సంబంధించిన కీలక అంశాలు చర్చకు వచ్చాయి. అంతర్జాతీయ కంపెనీలు భారత్ లో పెట్టుబడులు పెట్టడం, వాటిపై రాష్ట్రాల కోరిక ఏ విధంగా ఉన్నాయి అనే అంశాలపై చర్చించారు. అయితే ఈ కార్యక్రమంలో ఓ ప్రశ్నకు తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులను చూపిస్తూ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

* నవ్వులు పూయించిన చంద్రబాబు
అయితే చంద్రబాబు తాను ఎందుకు ఈ వ్యాఖ్య చేసింది వివరించే ప్రయత్నం చేశారు. వాళ్లు వెరీ రీచ్ అని.. పాము వెరీ పూర్ అంటూ చంద్రబాబు అన్నారు. మహారాష్ట్ర రాజధాని ముంబై( Mumbai).. ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని.. తెలంగాణ స్టేట్ హైయెస్ట్ ఫర్ క్యాపిట ఇన్ ఇండియా అని వెల్లడించిన చంద్రబాబు.. వాళ్లు చాలా ధనవంతులని.. తాము చాలా పేదవాళ్లం అంటూ చమత్కరించారు. దీంతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా నవ్వడంతో.. ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొంది.