PM Modi – White House : వైట్ హౌస్ లో ప్రధాని మోదీకి ఆత్మీయ స్వాగతం.. స్టేట్ డిన్నర్ అదిరిపోయింది

ప్రధాని మోదీ గౌరవార్థం అధ్యక్షుడు జోబైడన్ ఈ రోజుల వైట్ హౌస్ లో విందు ఏర్పాటుచేశారు. వెరైటీ వంటకాలతో మోదీకి ఆత్మీయ విందు ఇచ్చారు.

Written By: Dharma, Updated On : June 22, 2023 10:09 am
Follow us on

PM Modi – White House : అగ్రదేశం అమెరికాలో ప్రధాని మోదీ మేనియా కొనసాగుతోంది. అమెరికా ప్రభుత్వం ఆహ్వానం మేరకు ఆ దేశంలో పర్యటిస్తున్న మోదీ ఎక్కడికక్కడే ఆత్మీయ ఆహ్వానం అందుకుంటున్నారు. న్యూయర్క్ లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన యోగా దినోత్సవ వేడుకల్లో మోదీ పాల్గొన్నారు. ప్రవాస భారతీయులు పెద్దఎత్తున హాజరయ్యారు. రెండురోజు పర్యటనలో భాగంగా వాషింగ్టన్ చేరుకున్న మోదీకి ఆ దేశ అధ్యక్షుడు జో బైడన్ ఆత్మీయ స్వాగతం పలికారు. అంతకు ముందు ఆండ్రూస్ జాయింట్ బేస్ విమానాశ్రయంలో రెయిన్ కోట్ ధరించిన మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పెద్దఎత్తున వచ్చిన ఇండియన్స్ మోదీని చూసేందుకు ఆసక్తికనబరిచారు. మోదీ అందరికీ నమస్కరిస్తూ ముందుకు సాగారు.

వైట్ హౌస్ కు చేరుకున్న మోదీకి దేశ అధ్యక్షుడు బైడన్ ఆహ్వానం పలికారు. దేశ ప్రథమ పౌరురాలు జిల్లి బైడన్, జో బైడన్ లతో మోదీ చర్చలు జరిపారు. 20వ శతాబ్దానికి సంబంధించి అమెరికన్ బెక్ గ్యాలరీని జిల్లి బైడన్ ప్రధాని మోదీకి బహుమతిగా అందించారు. వింటేజ్ అమెరికన్ కెమేరాను అధ్యక్షుడు జో బైడన్ అందజేశారు. ప్రధాని పర్యటనతో అమెరికా, ఇండియా మధ్య బంధం మరింత మెరుగుపడనుందని.. ద్వైపాక్షిక చర్చలు, ఒప్పందాలు జరగనున్నాయి వైట్ హౌస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రధాని మోదీ గౌరవార్థం అధ్యక్షుడు జోబైడన్ ఈ రోజుల వైట్ హౌస్ లో విందు ఏర్పాటుచేశారు. వెరైటీ వంటకాలతో మోదీకి ఆత్మీయ విందు ఇచ్చారు.

ప్రధాని మోదీ పర్యటనను అమెరికా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేసింది. అమెరికన్ జాయింట్ కాంగ్రెస్ ను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఇదే వేదికపై మోదీ ప్రసంగించడం ఇది రెండోసారి. మోదీ పర్యటనలో ప్రవాస భారతీయులు సందడి అంతా ఇంతా కాదు. వారితో మోదీ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. మోదీ ఫొటోలు, భారత్ జెండాలతో నింపేశారు. కాగా మోదీ పలు రంగాల నిపుణులతో సమావేశమయ్యారు. టెస్లా అధినేత ఎలన్ మస్క్, ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత రోమెర్, ఇన్వెస్టర్ డేలియాతో సమాలోచనలు జరిపారు. భారత ఆర్థిక విధానాలు, సాంకేతికత గురించి చర్చించారు. వారిని ఇండియాకు ఆహ్వానించారు.