https://oktelugu.com/

Beggars : వారు యాచిస్తేనే బతుకుతారు.. అలాంటిది భారీ విందు ఇచ్చారు.. ఏకంగా కోట్లు ఖర్చు చేశారు.. వైరల్ వీడియో

వారికి ఎలాంటి ఆధారం లేదు. యాచిస్తేనే బతుకుతారు. ఎవరైనా దయతలచి దానం చేస్తేనే కడుపునకు ఇంత తింటారు. అలాంటి కుటుంబానికి చెందినవారు ఏకంగా భారీ విందు ఇచ్చారు. 20,000 మంది కడుపునింపారు. దానికోసం 1.25 కోట్లు ఖర్చు చేశారు.

Written By:
  • NARESH
  • , Updated On : November 19, 2024 / 09:32 PM IST

    Beggars

    Follow us on

    Beggars :ఆ యాచక కుటుంబం ఇలా చేయడం ఆ ప్రాంతంలో సామాన్యులకు షాక్ ఇచ్చింది. కోటీశ్వరులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. అయితే ఈ ఘటన జరిగింది మనదేశంలో కాదు. మన పక్కనే ఉన్న పాకిస్తాన్ లో. పాకిస్తాన్ దేశంలో గుజ్రాన్ వాలా పేరుతో ఒక ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో ఒక ఈ యాచక కుటుంబం జీవిస్తోంది. అయితే ఆ కుటుంబంలో ఓ మహిళ చనిపోయింది. వారి సాంప్రదాయం ప్రకారం ఆమె చనిపోయిన 40వ రోజు స్మారకంగా కుటుంబం భారీగా విందు ఇచ్చింది. తమకు తెలిసిన వారిని ఆహ్వానించింది. పాకిస్తాన్ దేశంలోని పంజాబ్ ప్రాంతాన్ని చెందిన సుమారు 20,000 మంది దీనికి హాజరయ్యారు. ఈ విందులో మురబ్బా, సిరిపాయ వంటి వంటకాలను వడ్డించారు. మాంసాహారాన్ని కూడా దండిగా పెట్టారు. ఈ విందు కోసం ఏకంగా 250 మేకపోతులను కోశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన అతిధులను రిసీవ్ చేసుకునేందుకు రెండువేల వాహనాలను ఉపయోగించారు.. ఈ విందు కోసం ఆ యాచక కుటుంబం 1.25 కోట్లు ఖర్చు చేసింది. ఇలా ఆడంబరంగా వారు చేస్తున్న ఖర్చు చూసి చుట్టుపక్కల వారు ముక్కున వేలేసుకున్నారు. శ్రీమంతులు నోరెళ్లపెట్టారు.

    ఔదార్యాన్ని చాటుకున్నారు

    యాచక కుటుంబం అత్యంత అద్భుతమైన విందు ఇవ్వడం పాకిస్తాన్ దేశంలో చర్చకు దారితీస్తోంది. అయితే కొంతమంది దీనిని హాస్యాస్పదమైన చర్య అని ఎద్దేవా చేస్తున్నారు. “కష్టపడి పని చేయలేరు. ఊరు మీద పడి అడుక్కుతింటారు. వారి పరిస్థితి చూసి.. అది నిజమే అనుకొని భావించి చాలామంది బిచ్చం వేస్తుంటారు. అలా వారు వసూలు చేసి ఇంతలా పోగు చేసుకున్నారు. ఇకపై నుంచి యాచకులు కనిపిస్తే ఎవరూ బిచ్చం వేయరని” వారు వ్యాఖ్యానిస్తున్నారు.. మరికొందరేమో ఇలా వేలాది మందికి ఆహారాన్ని అందించడం గొప్ప నిర్ణయం అని కొనియాడుతున్నారు.. అయితే ఈ విందుకు సంబంధించిన వీడియో క్లిప్స్ సామాజికమధ్యమాలలో సందడి చేస్తున్నాయి. “యాచించి బతికినప్పటికీ ఇలా ఇతరులకు ఆహారాన్ని దానం చేయడం గొప్ప విషయం. ఇలాంటి ఆలోచన అందరికీ రాదు. ఉన్నదాంట్లో ఖర్చుపెట్టి తోటి వారి కడుపు నింపే బృహత్కార్యం గొప్పగా అనిపిస్తోందని” నెటిజన్లు పేర్కొంటున్నారు.. వారు వంటల తయారు నుంచి మొదలుపెడితే.. అతిధులను తీసుకువచ్చేంత వరకు.. ఇలా ప్రతి విషయంలో ఎంతో జాగ్రత్త పాటించారని.. అది వారి వ్యక్తిత్వాన్ని సూచిస్తోందని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఇలాంటి వారిని యాచకులు అని చిన్న చూపు చూడకూడదని.. వారు చేస్తున్న పనిని గౌరవించాలని.. మంచి మనసు ఉంటే వారిని ప్రోత్సహించాలని.. నెటిజన్లు సూచిస్తున్నారు