Bangladesh Riots: బంగ్లాదేశ్‌కు చెందిన విద్యార్థి నాయకుడు మహ్మద్ హాదీ హత్య తర్వాత మళ్లీ అల్లర్లు చెలరేగాయి. వీటిని నియంత్రించాల్సిన ప్రభుత్వం అగ్నికి ఆజ్యం పోసినట్లుగా ఆందోళనకారులను రెచ్చగొడుతోంది. ముఖ్యంగా మైనారిటీలు, హిందువులు లక్ష్యంగా దాడులు చేయిస్తోంది. ఓ హిందూ యువకుడిని దారుణంగా కొట్టి.. సజీవ దహనం చేశారు. ఓ మహిళను నిప్పుల్లో పడేశారు. మహ్మద్ యూనూస్ నేతృత్వంలోని తాత్కాలిక పాలన ఈ దాడులను మతపరమైనవిగా కాకుండా, సాధారణ పౌరులపైనుగా చూడమని ప్రకటించింది. ఇది పరోక్షంగా భారత విద్వేషాన్ని రెచ్చగొట్టుతోందని విమర్శలు వస్తున్నాయి.
భారత సహనానికి పరీక్ష..
దీపు చంద్రాస్‌ను దారుణంగా చంపేశారు. మరొక మహిళ హత్యకు గురయ్యింది. ఇటువంటి సంఘటనలు భారత్‌కు ఓపిక పాటించడానికి సరిపోదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే చాలా ఓర్పు చూపామని, ఇక సహించి ఉండటం తప్పుగా భావిస్తున్నారు. సిలిగురి ద్వారా ఈశాన్య ప్రాంతాలకు మార్గాలను అడ్డుకుని బెదిరింపులు చేస్తున్నారు. భారత హైకమిషన్ కార్యాలయంపై పెద్ద ఆందోళనలు నిర్వహించారు. షేక్ హసీనా అంశంపై కూడా విషపూరిత విమర్శలు జరుగుతున్నాయి.
మాజీలు రాజకీయ ఖైదీలు..
మాజీ నాయకులపై కఠిన చర్యలు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో మాత్రమే సాధ్యమవుతున్నాయి. పాక్ ఇమ్రాన్ ఖాన్‌ను జైలుకు పంపింది. బంగ్లా షేక్ హసీనాకు ఉరిశిక్ష ప్రకటించింది. ఇటువంటి చర్యలు రాజకీయ ప్రతీకారాలుగా కనిపిస్తున్నాయి.
భారత ఆటంకాలు..
భారత్ సహనానికి ప్రధాన కారణం దేశంలోని భారీ బంగ్లాదేశీయ జనాభా. ఈశాన్య రాష్ట్రాలతోపాటు తెలంగాణ, మహారాష్ట్రలో వారు ఎక్కువగా ఉన్నారు. ఏదైనా ప్రతీకార చర్యలు తీసుకుంటే, వారు అంతర్గత గందరగోళాలు రేకెత్తించే ప్రమాదం ఉంది. పాకిస్తాన్, చైనా సమర్థనతో బంగ్లాదేశ్ ధైర్యపడుతోంది. చైనా భారీ పెట్టుబడులు పోసుకుంటూ, యువతలో భారత వ్యతిరేక భావాలను పెంచుతోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ అధిక జాగ్రత్తలు పాటించాలి. సరిహద్దులు, ఆంతరిక భద్రతలపై దష్టి పెట్టాలి. దీర్ఘకాలిక వ్యూహాలు రూపొందించి, మైనారిటీల రక్షణకు ఒత్తిడి తీసుకోవాలి.