Homeఅంతర్జాతీయం Bashar al-Assad : అసద్..ఈ కాలపు హిట్లర్.. ఇతడు చేసిన అరాచకాలు ఎలాంటివో తెలుసా?!

 Bashar al-Assad : అసద్..ఈ కాలపు హిట్లర్.. ఇతడు చేసిన అరాచకాలు ఎలాంటివో తెలుసా?!

Bashar al-Assad :  ఉద్యమాలు చేస్తున్న ప్రజలకు తిరుగుబాటు దళాల సహకారం కూడా తోడు కావడంతో సిరియాలో అసద్ పరిపాలన అంతమైంది. అసద్ సిరియా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అత్యంత నియంతృత్వాన్ని ప్రదర్శించేవాడు. తమ దేశానికి చెందిన ప్రజలపైనే రసాయన, సిలిండర్ దాడులు చేయించేవాడు. ఇదే విషయాన్ని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ 2016లో తెలిపింది. ఈ సంస్థ 2011 నుంచి 2015 వరకు సిరియాలో జరుగుతున్న పరిణామాలను అత్యంత దగ్గరుండి పరిశీలించింది. రహస్యంగా వివరాలు సేకరించింది. ఈ సందర్భంగా అనేక విషయాలు బహిర్గతం చేసింది. మిగతా సంవత్సరాలకు సంబంధించిన వివరాలు అందకపోవడంతో వాటి గురించి వివరించలేకపోయింది. ఆ కాలంలోనే అధికారికంగా సిరియా అధ్యక్షుడు అసాధ్య లక్ష మందికి మరణశిక్ష లు విధించాడు. అయితే అనధికారికంగా మరో మూడు లక్షల మందికి ఉరిశిక్ష విధించాడు.. సిరియాలోని సాయ్ డాన్ యా జైల్లో 30,000 మందికి ఉరిశిక్ష విధించాడు. ఈ జైల్లో ఉన్న రెండు భవనాలలో ఎరుపు రంగు వేసిన భవనంలో సాయుధ తిరుగుబాటు దళాలకు చెందిన వారిని… తెలుపు రంగులో విచారణ కొనసాగుతున్న సాయుధ తిరుగుబాటుదారులను వచ్చేవారు. రెండు వారాలకు ఒకసారి న్యాయమూర్తితో విచారణ జరిపించేవారు. కేవలం 3 లేదా నాలుగు నిమిషాల్లోనే విచారణ ప్రక్రియ పూర్తయింది. వాదనలు, ప్రతి వాదనలు వినకుండానే ఏకకాలంలో 50 మందికి మరణశిక్ష విధించేవారు. అయితే మరణ శిక్ష విధించే ముందు వారికి ఎటువంటి విషయాన్ని చెప్పేవారు కాదు. వారి కళ్ళకు గంటలు కట్టి తెలుపు రంగు భవనం వద్దకు తీసుకెళ్లి.. విద్యుదాఘాతానికి గురిచేసి.. అప్పటికి చనిపోకపోతే చిత్రహింసలు పెట్టి చంపేవారు.. ఒకవేళ జైలు అధికారులు బ్యారక్ ల వద్దకు వచ్చినప్పుడు.. ఖైదీల కళ్ళకు గంతలు కట్టేవారు. కేవలం అర్ధరాత్రి పూట మాత్రమే మరణ శిక్షలు విధించేవారు. అసద్ కు వ్యతిరేకంగా వ్యవహరించిన వారందరికీ దారుణమైన శిక్షలు వేసేవారని తెలుస్తోంది.

కొత్త ప్రభుత్వం అప్పుడే

సిరియాలో అసద్ పరిపాలన ముగిసిన నేపథ్యంలో.. తిరుగుబాటుదారులు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. అంతర్యుద్ధం వల్ల సిరియా 70% దెబ్బతిన్నదని.. దాని పునర్నిర్మానానికి చాలా సమయం పడుతుందని తెలుస్తోంది. అమెరికా, పశ్చిమాసియా దేశాలు సహాయం చేస్తేనే సిరియా మళ్ళీ కొత్త రూపం సంతరించుకుంటుందని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం అతివాద ముస్లిం ధోరణి ప్రదర్శిస్తే ప్రపంచ దేశాల నుంచి సహకారం అందరం కష్టమని తెలుస్తోంది. సౌదీ అరేబియా, మిగతా అరబ్ దేశాలు సహకారం అందించినప్పటికీ.. అది ఒక పరిమితికి మాత్రమే లోబడి ఉంటుందని తెలుస్తోంది. మరోవైపు సిరియా ప్రభుత్వ అధినేతగా తిరుగుబాటు నాయకుడు అబు మహమ్మద్ అల్ గోలానీ ని నియమిస్తారని సమాచారం. మరోవైపు మీడియా కూడా తన నిస్సహాయతను తిరుగుబాటు దళాలకు చెప్పేసింది..” మాపై అసద్ తీవ్రంగా ఒత్తిడి చేసేవాడు. అనుకూలంగా రాయాలని ఇబ్బంది పెట్టేవాడు. లేకపోతే చంపేస్తామని బెదిరించేవాడు. అందువల్లే అతడికి అనుకూలంగా రాయాల్సి వచ్చింది. ఇప్పుడు మాత్రం నవసిరియా వైపు మేముంటాం. ప్రజల పక్షాన వార్తలు రాస్తామని” మీడియా ప్రతినిధులు పేర్కొన్నారు..

భారతీయులు ఎలా ఉన్నారంటే

సిరియా ప్రాంతంలో ఉన్న భారతీయులు క్షేమంగా ఉన్నారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. డమాస్కస్ ప్రాంతంలోని భారత రాయబార కార్యాలయం యధావిధిగా పనిచేస్తుందని తెలుస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం 90 మంది భారతీయులు కొన్ని సంవత్సరాలుగా సిరియాలో నివాసం ఉంటున్నారు. వీరిలో 14 మంది ఐక్యరాజ్యసమితి సంస్థల్లో పని చేస్తున్నారు. ఇక్కడ ఉన్న భారతీయులతో ఎంబసీ అధికారులు ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు.

 

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular