America Weather : అమెరికాలో ఇటీవల కొన్ని ప్రాంతాల్లో తీవ్రంగా అగ్నిప్రమాదాలు సంభవించాయి. కానీ, ఇప్పుడు సౌత్ అమెరికా(South America)లో తీవ్రమైన మంచు తుఫానులు భీభత్సం సృష్టిస్తున్నాయి. అక్కడి ప్రాంతాలు పూర్తిగా మంచుతో కప్పబడిపోయి, నిత్యజీవితంపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి.
భారీ మంచు తుఫాను ప్రభావం
అమెరికా దక్షిణ భాగంలో కఠినమైన వాతావరణం కారణంగా 2,100కు పైగా విమానాలు రద్దు అయ్యాయి. టెక్సాస్, లూసియానా, మిస్సిసిపి, అలబామా, జార్జియా, మిల్వాకీ, దక్షిణ క్యారోలినా, ఫ్లోరిడా(Florida) రాష్ట్రాలు భయంకరమైన మంచుతో పూర్తిగా ఫ్రీజ్ అయ్యాయి. 10 ఇంచ్‌లకు పైగా మంచు రాష్ట్రాలపై పేరుకుంది.
వాహన రాకపోకలపై ప్రభావం
జీరో డిగ్రీలు దాటిన తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా రహదారులు పూర్తిగా జామ్ అయ్యాయి. విమానాలు రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టెక్సాస్, జార్జియా, మిల్వాకీ ప్రాంతాల్లో భయంకరమైన మంచు కారణంగా ఇప్పటివరకు నాలుగు మరణాలు నమోదయ్యాయి.
ఎయిర్‌పోర్టులు మూసివేత
హ్యూస్టన్‌లో ఉన్న జార్జ్ బుష్ ఇంటర్‌కాంటినెంటల్ ఎయిర్‌పోర్ట్(Airport), విలియం పీ. హాబీ ఎయిర్‌పోర్టులను తాత్కాలికంగా మూసివేశారు. ఈ విమానాశ్రయాలు బుధవారం మళ్లీ తెరచుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. తలహాసీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో కూడా అన్ని విమానాలు రద్దు చేయబడ్డాయి.
లూసియానాలో విపరీత పరిస్థితులు
లూసియానాలోని న్యూవార్లియన్స్ పరిసర ప్రాంతాలు 1963 తర్వాత ఇప్పుడు భారీ మంచు తుఫానును ఎదుర్కొంటున్నాయి. స్కూళ్లను మూసివేసి, ప్రజలకు అప్రమత్తత సూచనలు జారీ చేశారు.
వెదల్ అలర్ట్
లూసియానా గవర్నర్ జెఫ్ ల్యాండ్రీ ఈ తీవ్ర వాతావరణ పరిస్థితులపై ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే 7 రోజుల్లో పరిస్థితులు మరింత విషమంగా మారవచ్చని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని కోరారు. జార్జియా, సవానా ప్రాంతాల్లో బలమైన మంచు వల్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
తీవ్రమైన గడ్డు పరిస్థితులు
ఈ విపరీత వాతావరణం ప్రజల జీవితాలను సవాళ్లతో నింపింది. రోడ్లపై మంచు పేరుకోవడంతో పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. పరిస్థితులు అదుపులోకి రావడానికి మరికొంత సమయం పట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండి, అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు వెళ్లాలని సంబంధిత అధికారులు హెచ్చరిస్తున్నారు.