Homeఅంతర్జాతీయంAmerica: ఉద్యోగుల తొలగింపునకు బ్రేక్‌.. ట్రంప్‌ నిర్ణయంపై కోర్టు స్టే!

America: ఉద్యోగుల తొలగింపునకు బ్రేక్‌.. ట్రంప్‌ నిర్ణయంపై కోర్టు స్టే!

America: అమెరికా అధ్యక్షుడిగా 2.0 పాలన మొదలు పెట్టిన ట్రంప్‌.. దూకుడు నిర్ణయాలతో అందరూ ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ప్రపంచ దేశాలపై సుంకాలు విధించారు. కెనడా, మెక్సికో, చైనా దిగుమతులపై 25 శాతం సంకం విధించారు. పనామా కాలువ, గ్రీన్‌లాండ్, గాజా స్వాధీనానికి పావులు కదుపుతున్నారు. అక్రమ వలసవాదులను స్వదేశాలకు పంపిస్తున్నారు. గోల్డ్‌ కార్డ్‌ వీసా ప్రవేశపెట్టారు. పరోక్షంగా అమెరికా సిటిజన్‌ షిప్‌ను అమ్మకానికి పెట్టారు. ఇక ప్రభుత్వ వ్యయాలను తగ్గింపులో భాగంగా పలు విభాగాల్లో పెద్ద ఎత్తున కోతలు విధిస్తున్న ట్రంప్‌ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. భారీ సంఖ్యలో ఫెడరల్‌ ఉద్యోగులను తొలగిస్తూ (Miss firing) అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా డిస్ట్రిక్ట్‌ జడ్జి విలియం అల్సప్‌ అడ్డుకున్నారు. ట్రంప్‌ నిర్ణయాన్ని నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. పర్సనల్‌ మేనేజ్మెంట్‌ కార్యాలయానికి అలాంటి అధికారాలు లేవని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ట్రంప్‌ పరిపాలన కింద, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫిషియెన్సీ (Doze) అనే కొత్త విభాగం ద్వారా ప్రభుత్వ ఖర్చులను తగ్గించే లక్ష్యంతో 65,000 మంది ఫెడరల్‌ ఉద్యోగులకు బై అవుట్‌ ఆఫర్‌ను అందించారు. ఈ ఆఫర్‌ను 2 మిలియన్‌ మందికి పైగా ఉద్యోగులు అందుకున్నారు, ఫిబ్రవరి 7 నాటికి 65,000 మంది దీనిని స్వీకరించారు.

 

Also Read: వైఎస్ఆర్ కాంగ్రెస్ కు సరికొత్త ఫైర్ బ్రాండ్ ఆమె!

 

తాత్కాలిక బ్రేక్‌..
ఈ పెద్ద ఎత్తున ఉద్యోగ తొలగింపు ప్రణాళికను అమలు చేయడానికి ముందు, ఒక అమెరికన్‌ జడ్జి తాత్కాలికంగా దీనిని నిలిపివేశారు. ఈ నిర్ణయం వల్ల ఉద్యోగాల తొలగింపు ప్రక్రియకు బ్రేక్‌ పడినట్లు పరిగణించబడుతోంది. ఈ ఆటంకం వెనుక కారణాలు ఇంకా స్పష్టంగా వెల్లడి కానప్పటికీ, చట్టపరమైన సవాళ్లు, ఫెడరల్‌ ఉద్యోగుల హక్కుల రక్షణకు సంబంధించిన వాదనలు దీనిలో భాగంగా ఉండవచ్చు. ఈ సందర్భంలో, ఇంటర్నల్‌ రెవెన్యూ సర్వీస్‌ (IRS) వంటి ఏజెన్సీలలో వేలాది మంది ఉద్యోగులను తొలగించే ప్రతిపాదనలు కూడా చర్చలో ఉన్నాయి. ఉదాహరణకు, గీలోని పోస్ట్‌ల ప్రకారం, ఐఖ నుండి 6,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని పేర్కొనబడింది, అయితే ఇది అధికారికంగా ధ్రువీకరించబడలేదు. జడ్జి ఆదేశాల కారణంగా ఈ ప్రక్రియ ప్రస్తుతం స్థంభించిన స్థితిలో ఉంది. మొత్తంగా, అమెరికాలో ఉద్యోగాల తొలగింపునకు సంబంధించిన ప్రణాళికలు పెద్ద ఎత్తున ప్రారంభమైనప్పటికీ, చట్టపరమైన జోక్యంతో ఇప్పటికిప్పుడు బ్రేక్‌ పడినట్లు కనిపిస్తోంది. ఈ విషయంలో తదుపరి అప్‌డేట్స్‌ కోసం వేచి చూడాల్సి ఉంటుంది.

ఉద్యోగుల కోతలపై ట్రంప్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ కొన్ని కార్మిక యూనియన్లు కోర్టును ఆశ్రయించాయి. పలు ఏజెన్సీల్లో దాదాపు ప్రొబేషనరీ సిబ్బంది అందర్నీ తొలగిస్తున్నారని, ఇది చట్ట వ్యతిరేకమని వారు ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి అల్సప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘పర్సనల్‌ మేనేజ్మెంట్‌ కార్యాలయానికి తన సొంత సిబ్బందిని తొలగించే హక్కు ఉంది గానీ.. ఇతర విభాగాల్లో కోతలు విధించే అధికారం లేదు. ఫెడరల్‌ ఏజెన్సీలే తమ విభాగాల్లో సిబ్బంది నియామకాలు, తొలగింపులు నిర్వహించుకునేలా కాంగ్రెస్‌ వాటికి అధికారం కల్పించింది. కోతలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చట్టవ్యతిరేకంగా కన్పిస్తోంది‘ అని న్యాయమూర్తి వెల్లడించారు.

 

Also Read: జైలు వీడియో.. పోసానికి టిడిపి శ్రేణుల గిఫ్ట్.. వైరల్!

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular