మారిన జీవనశైలి కారణంగా చాలామంది డేటింగ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం డేటింగ్ మీద యువత ఆసక్తి కోల్పోతున్నారు.
Images source: google
ఆన్‌లైన్‌లో ఉండే డేటింగ్ యాప్‌ల ద్వారా భాగస్వామిని సెలెక్ట్ చేసుకునేవాళ్లు. వాళ్లను కలిసి, అన్ని మాట్లాడుకున్న తర్వాత ఒకే అయితే పెళ్లి చేసుకునేవారు.
Images source: google
కానీ ప్రస్తుతం యువత డేటింగ్ యాప్స్‌పై అంత ఆసక్తి చూపించట్లేదు. అసలు డేటింగ్‌పై ఆసక్తి కోల్పోవడానికి కారణమేంటో మరి తెలుసుకుందాం.
Images source: google
ప్రస్తుతం యువత డేటింగ్ యాప్స్‌పై ఇంట్రెస్ట్ కోల్పోతున్నారని తాజాగా ఓ సర్వే తెలిపింది. వివిధ కారణాల వల్ల ఆసక్తి కోల్పోయినట్లు ప్యూ రీసెర్చ్ సర్వే తెలిపింది.
Images source: google
డేటింగ్ చేసే ముందు పార్ట్‌నర్ నుంచి ఎన్నో ఆశిస్తారు. దీనివల్ల వాళ్లకు ఏదో లోటుగానే అనిపిస్తుంది. దీంతో నిరాశకు గురవుతారు.
Images source: google
ఒక బంధంలో అర్థం చేసుకునే గుణం, సర్దుకుపోయే గుణం చాలా ముఖ్యమైనది. కానీ డేటింగ్‌లో ఇవన్నీ ఉండవు. దీంతో నిరాశకు గురై.. డేటింగ్‌పై ఆసక్తి కోల్పోతున్నారు.
Images source: google
పార్ట్‌నర్‌తో ఎంత మంచిగా ఉన్నా కూడా సరైన పార్ట్‌నర్ దొరకడంలేదని చాలా మంది దీనిని దూరం పెడుతున్నారు. మింగిల్ లైఫ్ కంటే సింగిల్ బెటర్ అని ఫీల్ అవుతున్నారు.
Images source: google
డేటింగ్ చేసిన తర్వాత అసంతృప్తి, మానసిక సమస్యలు, ఒత్తిడి వంటివి ఉంటాయని యువత ముందే భావించి ఒంటరిగా ఉండటానికి ట్రై చేస్తోంది.
Images source: google
ఈ తరం యవత ఎక్కువగా వాళ్లకు నచ్చినట్లు బ్రతకడానికి ఇష్టపడుతున్నారు. దీంతో ఇలా అన్నింటికి కండీషన్లు పెడుతూ.. వాళ్లకు నచ్చినట్లు ఉండాలంటే కష్టమని డేటింగ్‌పై ఆసక్తి కోల్పోతున్నారు.
Images source: google