బాబర్ ను పాకిస్తాన్ క్రికెట్ జట్టు నుంచి ఎందుకు తొలగించారు?

Images source: google

ఇంగ్లాండ్ చేతిలో తొలి టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయిన నేపథ్యంలో.. రెండవ టెస్ట్ కోసం పాకిస్తాన్ జట్టులో అనేక మార్పులు, చేర్పులు చేపట్టారు.

Images source: google

ఇందులో భాగంగా స్టార్ ఆటగాడు బాబర్ అజాం ను రెండవ టెస్ట్ కోసం జట్టు నుంచి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తొలగించింది.

Images source: google

షహీన్ ఆఫ్రిది, నసీం షా ను కూడా చివరి రెండు టెస్టులకు ఎంపిక చేయలేదు. పైగా జట్టు నుంచి తొలగించారు..

Images source: google

జట్టు నుంచి బాబర్ ను తొలగించడం పట్ల సోషల్ మీడియాలో రకరకాల స్పందనలు వ్యక్తమవుతున్నాయి.

Images source: google

బాబర్ ను తొలగించడాన్ని పాకిస్తాన్ స్టార్ ఆటగాడు ఫకర్ జమాన్ తప్పు పట్టాడు.

Images source: google

స్టార్ ఆటగాళ్లకు ఫామ్ అనేది పెద్ద విషయం కాదని.. జట్టు నుంచి తొలగిస్తే అది మిగతా ఆటగాళ్లపై ప్రభావం చూపిస్తుందని ఫకర్ జమాన్ పేర్కొన్నాడు.

Images source: google

బాబర్ ఫామ్ కోల్పోవడంతో.. ఇంగ్లాండ్ తో జరిగే చివరి రెండు టెస్టుల నుంచి తొలగించినట్టు వార్తలు వస్తున్నాయి.

Images source: google

2022 తర్వాత బాబర్ ఇంతవరకు ఒక్క టెస్ట్ హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. పైగా అతడు దారుణమైన ఆట తీరు ప్రదర్శిస్తున్నాడు.

Images source: google

అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మేనేజ్మెంట్ మాత్రం.. ఇంగ్లాండ్ తర్వాత పాకిస్తాన్ కు బిజీ షెడ్యూల్ ఉండడం వల్లే.. స్టార్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇస్తున్నట్టు సర్ది చెప్పుకుంది.

Images source: google