https://oktelugu.com/

బాలీవుడ్ సెలబ్రిటీలకు రణతంభోర్ నేషనల్ పార్క్ ఎందుకు ఇష్టమైన ప్రదేశం?

Images source: google

కొన్ని ప్రాంతాలకు సెలబ్రెటీలు కంటిన్యూగా వెళ్తుంటారు. వారికి కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాలు కూడా ఉంటాయి. అదే విధంగా బాలీవుడ్ సెలబ్రిటీలు రణతంభోర్ నేషనల్ పార్క్ కు వెళ్తుంటారు. మరి ఈ పార్క్ విశిష్టత ఏంటంటే?

Images source: google

రణతంబోర్ ఒక జాతీయ ఉద్యానవనం. ఇది  392 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. పులులకు ప్రసిద్ధి చెందింది ఈ పార్క్. పులులు ఇక్కడ సహజంగా తిరగగలవు.

Images source: google

శిల్పాశెట్టి వంటి బాలీవుడ్ ప్రముఖులకు ఇష్టమైన వన్యప్రాణుల సఫారీ గమ్యస్థానం ఈ నేషనల్ పార్క్. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో విహారయాత్రల కోసం తరచుగా ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు స్టార్లు.

Images source: google

ముఖ్యంగా దేవాలయాలు, నీటి ట్యాంకులు, గొప్ప ద్వారాలు, ఎత్తైన గోడలతో అందంగా ఉంటుంది. అప్పట్లో యుద్దాలు చేసేందుకు రక్షణ గోడలు ఏ విధంగా ఉన్నాయి, రక్షణ కోసం ఎలా సిద్దం చేసుకున్నారో చూడవచ్చు.

Images source: google

ఇక్కడ రకరకాల పక్షులను చూడవచ్చు. సారస్ క్రేన్‌ల నృత్యం, ఇండియన్ డార్టర్ ప్రదర్శనలు, లెస్సర్ విజిల్ డక్, బార్-హెడ్ గూస్ వంటి పక్షుల అద్భుతమైన దృశ్యాలను ఆస్వాదించవచ్చు.

Images source: google

 సోహా అలీ ఖాన్, ఆమె కుటుంబంతో సహా, పార్కును సందర్శించారు. వారి సఫారీ సమయంలో కొన్ని అందమైన దృశ్యాలను చూస్తూ సెల్ఫీలకు ఫోజులు ఇచ్చారు.

Images source: google

చంబల్ రివర్ సఫారి భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైన సఫారీ. దీన్ని కూడా ఇక్కడ చూడవచ్చు.  అనేక అందమైన పక్షి జాతులను చూసే అవకాశాన్ని అందిస్తుంది ఈ నేషనల్ పార్క్.

Images source: google

దియా మీర్జా వంటి బాలీవుడ్ ప్రముఖుల మాదిరి మీ హాలీడేస్ ను రణతంబోర్ నేషనల్ పార్క్‌ను సందర్శించండి.

Images source: google