మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు వచ్చారు కానీ హీరోయిన్ లు రావడం చాలా అరుదు. కేవలం నిహారిక మాత్రమే ఆ ధైర్యం చేసిందని చెప్పాలి.

సినిమాల్లోకి రాకముందే నటన మీద ఉన్న ఇంట్రెస్ట్ తో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో నటించి తనేంటో ప్రూఫ్ చేసుకుంది.

ఒక మనసు అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది నాగబాబు కూతురు నిహారిక

ఈ సినిమా కంటే ముందే యాంకరింగ్ చేసింది. మొత్తం మీద సినిమా బ్యాగ్రౌండ్ ఉన్నా సరే టాలెంట్ ఉండాల్సిందే అని నిరూపించింది.

అంతా బాగున్నా ఈమెకు ఆశించిన ఆఫర్లు  రాలేదు. ఈమె నటించిన సినిమాలు పెద్దగా హిట్ అవకపోవడంతో పెద్దగా రాణించలేదు అనే టాక్ వచ్చింది

స్టార్ హీరోయిన్ ల లిస్ట్ లో చేరలేదు ఈ అమ్మడు. అంతేకాదు నటిగా కూడా కంటిన్యూ అవలేకపోయింది.

2020లో చైతన్య జొన్నల గడ్డతో పెళ్లి చేసుకొని కొన్ని కారణాల వల్ల విడిపోయింది ఈ జంట.

ఇప్పుడు ప్రోడ్యూసర్ గా ఓటీటీల్లో సినిమాలు, షోలు నిర్వహించినా ఆశించిన ఫలితాలు అందడం లేదు అని టాక్.

Off-white Banner

Thanks For Reading...