https://oktelugu.com/

పాస్ పోర్టులు నీలం, తెలుపు, మెరూన్ రంగుల్లో ఎందుకు ఉంటాయి?

Images source: google

పాస్‌పోర్ట్ ఒక దేశ ప్రభుత్వం తన పౌరులకు వారి గుర్తింపును, పౌరసత్వాన్ని ధృవీకరిస్తూ జారీ చేసే ప్రయాణ పత్రం.

Images source: google

భారతీయ పాస్‌పోర్ట్‌లు నాలుగు విభిన్న వర్గాలలో వస్తాయి. ప్రతి ఒక్కటి నిర్దిష్ట ప్రయోజనాన్ని అందిస్తాయి. ప్రత్యేక రంగు కోడ్ ను కలిగి ఉన్నాయి.

Images source: google

నీలిరంగు పాస్‌పోర్ట్:  ఈ రంగు పాస్ పోర్ట్ అర్థం ఏంటంటే? సాధారణ భారతీయ పౌరులను దౌత్య లేదా ప్రభుత్వ అధికారుల నుంచి వేరు చేస్తూ, టైప్ P పాస్‌పోర్ట్ సాధారణ ప్రజలకు జారీ చేస్తారు.

Images source: google

వైట్ పాస్‌పోర్ట్: ఇది అధికారిక ప్రయోజనాల కోసం విదేశాలకు వెళ్లే భారత ప్రభుత్వ అధికారుల కోసం ప్రత్యేకంగా రిజర్వ్ చేశారు.

Images source: google

ఇందులో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS), ఇతర ప్రభుత్వ అధికారులు ఉంటారు.

Images source: google

మెరూన్ పాస్‌పోర్ట్: దౌత్యపరమైన పాస్‌పోర్ట్, మెరూన్ రంగుతో విభిన్నంగా ఉంటుంది. ప్రత్యేకంగా దౌత్యవేత్తలకు, అంతర్జాతీయ ప్రయాణ, దౌత్య కార్యకలాపాల కోసం ఎంపిక చేసిన ప్రభుత్వ అధికారులకు జారీ చేస్తారు.

Images source: google

నారింజ రంగు పాస్‌పోర్ట్: ఈ పాస్‌పోర్ట్ నియమించబడిన దేశాలకు ప్రయాణించడానికి వలస క్లియరెన్స్ అవసరమయ్యే పౌరులకు, సాధారణంగా తక్కువ విద్యార్హతలు ఉన్నవారికి జారీ చేస్తారు.

Images source: google