https://oktelugu.com/

 నాన్ వెజ్ తినే వాళ్లతో పోలిస్తే.. తినని వాళ్లలో చాలా మార్పులు మనం గమనించవచ్చు. కనీసం ఒక నెల రోజుల పాటు నాన్ వెజ్ తినకుండా ఉండండి. అప్పుడు ఫలితం మీరే చూస్తారు.

Images source: google

మొదట్లో కష్టమైన నెల రోజుల పాటు నాన్ వెజ్‌కి బదులు ఆకు కూరలు, తాజా కూరగాయలు, సోయా బీన్స్, ఫైబర్ ఉండే పదార్థాలను ఎక్కువగా తీసుకోండి. ఇందులోని పోషకాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.

Images source: google

అలాగే మలబద్దకం, ఫైల్స్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే మొక్కలకు సంబంధించిన ఆహారాల్లో కెలరీలు తక్కువగా ఉంటాయి. దీనివల్ల కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. దీంతో బరువు తగ్గుతారు.

Images source: google

మాంసాహారాల్లో సాచురేటెడ్, ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. దీంతో రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. దీనివల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. నాన్ వెజ్ తినే వాళ్లతో పోలిస్తే.. తినని వాళ్ల స్కిన్ చాలా కాంతిమంతంగా ఉంటుంది.

Images source: google

వెజ్ ఎక్కువగా తినడం వల్ల ఒత్తిడి, మానసిక ఆందోళన వంటి సమస్యలు తగ్గుతాయి. మాంసాహారం వల్ల కొందరికి శరీరంలో వాపు ఏర్పడుతుంది. అలాగే పెద్ద పేగు, రొమ్ము క్యాన్సర్లు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Images source: google

శాకాహారంలో కాల్షియం, ప్రొటీన్, ఐరన్, విటమిన్లు, ఒమేగా3 ఫ్యాటీ ఆమ్లాలు శరీరానికి అందుతాయి. అలాగే కిడ్నీలో రాళ్ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

Images source: google e

నాన్ వెజ్ మానేసి అన్ని రకాల కూరగాయలు, తాజా పండ్లు తినాలి. వెజ్ తినడం వల్ల రక్తపోటు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే జీర్ణ క్రియ కూడా సక్రమంగా పనిచేస్తుంది.

Images source: google

అలాగే టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదాన్ని కూడా శాకాహారం తగ్గిస్తుంది. నాన్ వెజ్ తినడం వల్ల మూత్ర విసర్జన ఫ్రీగా కాదు. అదే శాకాహారం తింటే ఫ్రీగా అవుతుంది.దీర్ఘకాలిక సమస్యలను తగ్గిస్తాయి.

Images source: google