హిందూ ప్రజలు ఎంతగానో ఎదురు  చూసే వినాయక చవితి పండుగ రానే వస్తుంది. ఈ పండుగ గురించి చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ వెయిట్ చేస్తున్నారు.

Images source: google

వినాయక చవితి ప్రారంభం అయిన రోజు నుంచి దాదాపు 10 రోజుల పాటు పిల్లలకు పండగ అని చెప్పుకోవాల్సిందే. హిందూ పండుగల్లో వినాయక చవితి చాలా ముఖ్యమైనది.

Images source: google

వినాయకుడిని పూజించడం వల్ల ఎలాంటి విఘ్నాలు లేకుండా అన్ని సక్రమంగా జరుగుతాయని నమ్ముతారు. ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? ఏ సమయంలో విగ్రహ ప్రతిష్ఠ చేయాలి? పూజ చేయడానికి శుభ సమయం ఏంటో పూర్తి వివరాలు ఈ రోజు తెలుసుకుందాం.

Images source: google

వినాయక చవితి పండుగను భాద్రపద శుక్ల పక్ష చతుర్థి తిథి నాడు జరుపుకోవాలి. ఆ తిథిలో మాత్రమే విగ్రహాన్ని ప్రతిష్టించాలి. ఈ రోజును గణేశుడిని ఇంటికి తీసుకువచ్చి భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.

Images source: google

 ఈ ఏడాది వినాయక చవితి సెప్టెంబర్ 7వ తేదీన జరుపుకోవాలి. చతుర్థి తిథిలో మాత్రమే పండుగ చేసుకోవాలి. ఈ తిథి సెప్టెంబర్ 6వ తేదీ శుక్రవారం ఉదయం 12:08 గంటలకు మొదలవుతుంది. తర్వాత రోజు అనగా సెప్టెంబర్ 7వ తేదీ శనివారం మధ్యాహ్నం 2:05 గంటలకు పూర్తవుతుంది.

Images source: google

వినాయక చవితి రోజు ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే.. గణేశుడి అనుగ్రహం కలిగి కోరికలు నేరవేరుతాయి. అలాగే ఎలాంటి బాధలు ఉన్న తొలగిపోతాయని భక్తుల నమ్మకం.

Images source: google

వినాయక చవితి రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేయాలి. శుభ్రమైన దుస్తులు ధరించి పూజ ఆచరించాలి. మంత్రాలు జపిస్తూ ప్రాణ ప్రతిష్ట చేయాలి. గణేశుడి విగ్రహాన్ని ఉత్తరం లేదా తూర్పు దిశలో ప్రతిష్టించడం చాలా మంచిది.

Images source: google

అందులోనూ వినాయకుని తొండం కుడివైపుకు ఉండాలి. అలాగే ఎలుక కూడా ఉండాలి. భక్తి శ్రద్ధలతో పూజ చేస్తూ.. వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్లు, కుడుములు, లడ్డూ వంటివి చేసి నైవేద్యంగా సమర్పించాలి.

Images source: google

పది రోజుల పాటు వినాయకుడిని అసలు కదపకూడదు. చివరి రోజు కదిపి.. వినాయకునికి ఊరేగింపు చేసి నిమజ్జనం చేయాలి. ఇలా చేయడం వల్ల వినాయకుడి ఆశీస్సులు మీకు అందుతాయి

Images source: google