ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా భారీ సంఖ్యలో డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. డెంగ్యూ కొత్త వేరియంట్ వల్ల మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

Images source: google

అయితే డెంగ్యూ సోకిన తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలకు సులభంగా చెక్ పెట్టవచ్చు.

Images source: google

డెంగ్యూ సోకిన వాళ్లలో ప్రధానంగా ప్లేట్ లెట్లు తగ్గిపోవడం కనిపిస్తుంది. ప్లేట్ లెట్స్ ఎక్కువగా తగ్గిపోతే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది.

Images source: google

డెంగ్యూ వచ్చిన వాళ్లను బొప్పాయి పండు తినమని వైద్య నిపుణులు చెబుతుంటారు. బొప్పాయిలో ప్లేట్ లెట్లను పెంచే గుణం ఉండటంతో పాటు క్రమం తప్పకుండా దానిమ్మ తీసుకుంటే శరీరంలో రక్తం ఉత్పత్తి పెరుగుతుంది.

Images source: google

డెంగ్యూ వచ్చిన వాళ్లు నారింజ పండుతో అనేక సమస్యలకు చెక్ పెట్టవచ్చు. రోజుకు రెండు పండ్లను జ్యూస్ లా తీసుకున్నా మంచి ఫలితం పొందే అవకాశం ఉంటుంది.

Images source: google

ఖర్జూరా తినడం ద్వారా కూడా ప్లేట్ లెట్లను పెంచుకోవచ్చు. రోజుకు మూడు ఖర్జూరాలు తింటే ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి.

Images source: google

క్యారెట్ ను తిన్నా, జ్యూస్ చేసుకుని తాగినా మంచి ఫలితం ఉంటుంది. బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల కూడా ప్లేట్ లెట్ల సంఖ్యను సులభంగా పెంచుకోవచ్చు. ఆకుపచ్చ పండ్లు, కూరగాయలు తీసుకున్నా ప్లేట్ లెట్ల సంఖ్య పెరుగుతుంది.

Images source: google

రోజూ ఉదయం సమయంలో రెండు వెల్లుల్లి రెబ్బలను తీసుకుని నమిలి తినడం ద్వారా కూడా ప్లేట్ లెట్ల సంఖ్యను పెంచుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.

Images source: google

సహజంగా ప్లేట్ లెట్లను పెంచుకోవాలని భావించే వాళ్లు ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు.

Images source: google