చాలా పండ్లలో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉంటాయి. అలాంటి పండ్లు మీ చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి.

మీకు ఉన్న ముడతలను తొలగించడంలో సహాయం చేస్తాయి. కొల్లాజెన్ స్థాయి పెంచి చర్మాన్ని నిగారించేలా చేస్తాయి. మరి ఆ పండ్లు ఏంటంటే..

యాపిల్స్ లో విటమిన్ ఏ, బీ కాంప్లెక్స్, సి విటమిన్ ఉంటాయి. అంతేకాదు ఇన్ఫెక్షన్లు, అదనపు నూనెలను కూడా తొలగిస్తాయి యాపిల్స్.

చర్మాన్ని మెరిసేలా చేసి ముడతలు తగ్గించి యవ్వనంగా కనిపించేలా చేస్తాయి యాపిల్స్. వైద్యులు కూడా రోజుకు ఒక యాపిల్ తినమని చెబుతుంటారు సో తినేసేయండి.

దానిమ్మలో ప్యూనికాలాజిన్స్, ఎల్లాజిక్ యాసిడ్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని కాపాడటంలో సహాయం చేస్తాయి.

దానిమ్మ కొల్లాజెన్ ఏర్పడటాన్ని ప్రేరేపిస్తుంది. గింజలను తిన్నా సరే లేదా జ్యూస్ లను అయినా తాగండి.

అవకాడో లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. అంతేకాదు ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి. ఇవి చర్మాన్ని రక్షించి మీకు నిగారింపును అందిస్తాయి.

పుచ్చకాయలో నీటి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.  విటమిన్లు, ఖనిజాలు చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయం చేస్తాయి.

కివిలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఇ లు ఉంటాయి. చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడుతుంటాయి ఈ కివీ పండ్లు.

Off-white Banner

Thanks For Reading...