జాస్మిన్: మల్లెపూలు మంచి సువాసనను వెదజల్లుతాయ. గదిని సువాసన భరితంగా చేయడంలో ఎంతో సహాయం చేస్తాయి.
Images source: google
నందివర్దన: ఈ మొక్కల్లో కొన్ని క్రీముతో కూడి తెల్లని పువ్వులను కలిగి ఉంటాయి, అవి మంచి వాసనతో కూడి ఉంటాయి. ప్రకాశవంతమైన, పరోక్ష సూర్యకాంతిలో వృద్ధి చెందుతాయి. ఇంట్లోనే పెరుగుతాయి కూడా.
Images source: google
లావెండర్: లావెండర్స్ కూడా మంచి సువాసనను వెదజల్లుతాయ. వీటి స్మెల్ తో విశ్రాంతి ఫీల్ వస్తుంది. తోటలలో పెంచడం సాధారణమైనప్పటికీ, కొన్ని రకాలను సరైన కాంతితో ఇంటి లోపల పెంచవచ్చు.
Images source: google
యూకలిప్టస్: స్వచ్ఛమైన, రిఫ్రెష్ సువాసనకు ప్రసిద్ధి చెందింది. యూకలిప్టస్‌ను ఇంటి లోపల కుండలలో పెంచవచ్చు. దీని ఆకులు ఉత్తేజపరిచే సువాసనను వెదజల్లుతాయి. శ్వాసకోశ సమస్యలు రావు.
Images source: google
జెరేనియంలు: ఈ మొక్కలు సువాసనగల ఆకులను కలిగి ఉంటాయి. వీటిని తాకినప్పుడు వాటి సువాసనను విడుదల చేస్తుంటాయి. అంతేకాదు వీటిని తింటారు కూడా.
Images source: google
ఆర్కిడ్‌లు: ఒన్సిడియమ్ 'షారీ బేబీ' వంటి కొన్ని రకాల ఆర్కిడ్‌లు చాక్లెట్ లేదా వనిల్లాను పోలి ఉండే ఆహ్లాదకరమైన సువాసనను వెదజల్లుతుంటాయి. వీటిని ఇంటిలోపల పెంచవచ్చు.
Images source: google
పుదీనా: పెంచడం,చాలా సులభం. వంటల్లో ఉపయోగించడం వల్ల వంటలకు మంచి స్మెల్ వస్తుంది.
Images source: google
ఇంట్లో మంచి స్మెల్ వచ్చే మొక్కలను పెంచాలి అనుకుంటున్నారా? అయితే ఈ మొక్కలు పెంచేయండి..
Images source: google