ఎంత బిజీగా ఉన్నా సరే.. సమయం చూసుకుని మరి వాకింగ్ చేయాలి. రోజుకి కనీసం 30 నిమిషాలు నడిచిన సరే.. మీరు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు.
Images source: google
రోజుకి కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. నడవడం వల్ల డిప్రెషన్, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
Images source: google
అలాగే గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. రోజూ నడవడం వల్ల 19 శాతం వరకు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. వీటితో పాటు రక్తపోటును కూడా తగ్గిస్తుంది.
Images source: google
మూడు పూట భోజనం తర్వాత వాకింగ్ చేస్తే బరువు తగ్గుతారు. నడవడం వల్ల కేలరీలు తగ్గుతాయి. రోజూ నడవని వ్యక్తులతో పోలిస్తే.. నడిచే వ్యక్తుల్లో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్నట్లు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
Images source: google
నడవడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది. శరీరంలోని కండరాలు చక్కగా పనిచేసి కడుపు ఉబ్బరం, మలబద్దకం, జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. అలాగే ఎముకలు బలంగా తయారవుతాయి.
Images source: google
రోజూ నడవడం వల్ల మెదడు ఉత్తేజకరంగా తయారు అవుతుంది. మీకు ఆలోచించే శక్తి కూడా పెరుగుతుంది. తెలివితేటలు పెరుగుతాయి. మైండ్ బాగా రిఫ్రెష్ అవుతుంది.
Images source: google
రోజుకి కనీసం 30 నిమిషాలు నడవడం వల్ల శరీరంలో దాదాపు 150 కేలరీలు బర్న్ అవుతాయి. దీంతో శరీరంలోని కొవ్వు అంతా కరిగిపోతుంది. మధుమేహం, టైప్ 2 డయాబెటిస్, క్యాన్సర్లు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
Images source: google
ఎంత వర్క్ ఉన్నా రోజులో కనీసం 30 నిమిషాలు తప్పకుండా నడవడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. లేకపోతే ఇప్పుడున్న జీవనశైలికి అనారోగ్య సమస్యలతో బాధపడతారు.
Images source: google
అయితే రాత్రిపూట కంటే ఉదయం తినకుండా 30 నిమిషాలు వాకింగ్ చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి. రక్తప్రసరణ బాగా జరిగి.. రోజంతా రిఫ్రెష్‌గా ఉంటారు. మీ మైండ్ కూడా యాక్టివ్‌గా పనిచేస్తుంది. ఎలాంటి టెన్షన్ ఉన్నా కూడా కూల్‌గా ఉంటారు.
Images source: google