https://oktelugu.com/

భారతదేశంలో జరుపుకునే అత్యంత ఉత్సాహభరితమైన పండుగలలో జన్మాష్టమి ఒకటి. ఈ సమయంలో చూడదగ్గ బెస్ట్ ప్లేస్ ల గురించి తెలుసుకుందాం.

Image Source: Google

శ్రీకృష్ణుని జన్మస్థలం మధుర. ఇక్కడ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఈ పండుగ సందర్భంగా నగరం ఉత్సాహంగా ఉంటుంది.

Image Source: Google

Image Source: Google

బృందావనం శ్రీకృష్ణుడికి సంబంధించిన మరొక ముఖ్యమైన ప్రదేశం. కృష్ణుడు పెరిగిన ప్లేస్. రాధ, గోపికలతో కలిసి కన్నయ్య చిలిపి చేష్టలు చేసిన ప్రదేశం ఇదేనట.

కృష్ణుడు పుట్టిన వెంటనే మధురలోని గోకుల్ కు తీసుకొని వెళ్తారు. దత్తత తీసుకున్న తల్లిదండ్రులు యశోధ, నందల సంరక్షణలో ఇక్కడే పెరిగాడు చిన్ని కృష్ణుడు.

Image Source: Google

కృష్ణుడు మధురను విడిచిపెట్టిన తర్వాత సుమారు ఐదు వేల సంవత్సరాల పాటు ద్వారకలో ఉంటాడు. ఇది ఆయన రాజ్యం. ద్వారకలో జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతాయి. భారతదేశం నలుమూలల నుంచి భక్తులు వస్తారు.

Image Source: Google

ముంబైలో జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతాయి.. నగరంలో "దహీ హండి" సంస్కృతి ఎక్కువ కనిపిస్తుంది.

Image Source: Google

కర్ణాటకలోని ఉడిపి కృష్ణ దేవాలయానికి ప్రసిద్ధి. ఉడిపిలోని శ్రీకృష్ణ మఠం ద్వారక నీటి అడుగున మునిగిపోయిన తర్వాత ఏర్పడిందని నమ్ముతారు.

Image Source: Google

రాజస్థాన్‌లోని నాథద్వారా శ్రీకృష్ణునికి అంకితం చేసిన శ్రీనాథ్‌జీ ఆలయానికి నిలయం. ఆలయంలో జన్మాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు

Image Source: Google

పూరీలోని జగన్నాథ ఆలయంలో ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. 56 ఆహార పదార్థాలతో శ్రీకృష్ణుడిని అలంకరించిన చప్పన్ భోగ్ దర్శనం ఈ ప్రదేశంలో విశేషం.

Image Source: Google