https://oktelugu.com/

ఛార్జింగ్ విషయంలో చాలా మంది కొన్ని విషయాలు మర్చిపోయి లైట్ తీసుకుంటారు. దీనివల్ల కొన్ని సార్లు ఫోన్ లు పేలిపోయే ప్రమాదం కూడా ఉంది.

Image Source: Google

ఛార్జింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఫోన్ డామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఓ సారి చూసేయండి.

Image Source: Google

1. ఎక్కువ ఉష్ణోగ్రతలు: అధిక ఉష్ణోగ్రత ఉంటే బ్యాటరీ త్వరగా దెబ్బతింటుంది. అంటే ఛార్జింగ్ చేస్తున్నప్పుడు మీ ఫోన్‌ మీద డైరెక్టుగా సూర్యకాంతి పడకుండా చూసుకోవాలి.

Image Source: Google

2. ఎక్కువ సేపు ఛార్జ్: కొంత మంది ఛార్జ్ అయిన తర్వాత కూడా అలాగే వదిలివేస్తారు. ఛార్జింగ్ అయిన వెంటనే ఛార్జర్ నుంచి ఫోన్ ను తీయడం ఉత్తమం. లేదంటే స్విచ్ ఆఫ్ చేయండి.

Image Source: Google

3. బ్యాటరీ స్థాయి: మీ ఛార్జింగ్ 20% నుంచి 80% మధ్య ఉండేలా చూసుకోండి. దీనిని "ఛార్జ్ సైకిల్" అంటారు.

4.. కొందరు జీరో అయ్యే వరకు ఫోన్ మాట్లాడటం లేదా వీడియోలు చూస్తూ ఉండటం చేస్తారు. మరికొందరు కాస్త ఛార్జింగ్ అయిపోయినా సరే వంద శాతం ఉండేలా ప్రతి సారి ఛార్జ్ చేస్తుంటారు. ఇలా చేయకూడదు.

Image Source: Google

5. సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్: బ్యాటరీకి సంబంధించిన సాఫ్ట్ వేర్ ను అప్డేట్ చేస్తూ ఉండాలి. కొన్ని సార్లు మీకు నోటిఫికేషన్ లు కూడా వస్తాయి. వాటిని అప్డేట్ చేస్తూ ఉండాలి.

Image Source: Google

6. ఒరిజినల్ ఛార్జర్‌: తక్కువ ధర లేదా నకిలీ ఛార్జర్‌లు మీ ఫోన్ బ్యాటరీని, ఇతర భాగాలకు హాని కలిగిస్తాయి. అందుకే ఒరిజినల్ ఛార్జర్ లనే ఉపయోగించండి.

Image Source: Google