Images source: google
నల్ల శనగలను మాత్రమే కాకుండా వేరశెనగలను కూడా నానబెట్టి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని సామాన్యుల జీడిపప్పు అని కూడా అంటారు. ఇందులో పోషకాలు మెండుగా ఉంటాయి.
Images source: google
డ్రైఫూట్స్ కొనలేని వాళ్లు వీటిని డైలీ తింటే బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో కాల్షియం, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.
Images source: google
రోజుకి గుప్పెడు వేరుశెనగ గింజలను నానబెట్టి తింటే శరీరానికి కావల్సిన శక్తి అందుతుంది. వీటివల్ల మంచి కొలెస్ట్రాల్ బాడీలోకి చేరుతుంది.
Images source: google
చాలామంది జిమ్‌కి వెళ్తు.. బాడీ బిల్డింగ్‌లు చేస్తుంటారు. అలాంటి వాళ్లకి నానబెట్టిన వేరుశెనగ గింజలు బాగా ఉపయోగపడతాయి. ఇందులో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. దీంతో కండరాలు బలంగా పెరుగుతాయి.
Images source: google
రాత్రి నానబెట్టిన వేరుశనగ గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల తినే ఫుడ్ తొందరగా జీర్ణం అవుతుంది. మలబద్దకం, జీర్ణ సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంచడంలో సాయపడుతుంది.
Images source: google
క్రమం తప్పకుండా రోజూ పల్లీలు తినడం వల్ల రక్తప్రసరణ మెరుగు పడుతుంది. అలాగే గుండె సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సాయపడుతుంది. అలాగే గుండె పోటు వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
Images source: google
Images source: google
వేరుశెనగలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలను నిరోధిస్తాయి. ఇందులో ఉండే కాల్షియం, ఐరన్, జింక్ వంటి పోషకాలు శరీరంలో ఉండే హానికరమైన కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గించడంలో బాగా సాయపడతాయి.
Images source: google