Images source: google
రోజుకి 14 గంటలు పనిచేసి ఒత్తిడికి గురైన యువతి ఇటీవల చనిపోయిన సంగతి తెలిసిందే. సాధారణంగా ఆఫీస్‌లో రోజుకి ఎనిమిది గంటలు మాత్రమే పనిచేయాలి.
Images source: google
కానీ ఈ రోజుల్లో చాలా కంపెనీలు రోజుకి 14 నుంచి 15 గంటలు పాటు వర్క్ చేయించుకుంటున్నాయి. దీంతో చాలా మంది ఒత్తిడికి గురై అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు.
Images source: google
శరీరానికి నిద్ర, విశ్రాంతి తప్పనిసరి. ఎక్కువ గంటలు పనిచేసిన దానికి తగ్గ విశ్రాంతి బాడీకి ఇవ్వాలి. అప్పుడే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు.
Images source: google
విశ్రాంతి లేకుండా రోజుకి ఎక్కువ గంటలు పనిచేస్తే మెదడు దెబ్బతింటుంది. ఒత్తిడికి లోనయ్యి.. ఏ విషయాన్ని సరిగ్గా ఆలోచించలేరు. అదే కూర్చుని ఎక్కువ గంటలు పనిచేసే వాళ్లలో అయితే ఊబకాయం, పొత్తికడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి.
Images source: google
ఒకే ప్లేస్‌లో ఉండి.. గంటల తరబడి పనిచేస్తే మెదడు ఒత్తిడికి గురి అవుతుంది. దీంతో చేసే పని కూడా సరిగ్గా చేయలేరు. పనిచేసే ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి విశ్రాంతి తీసుకోవాలి. అప్పుడే చేసే పని మీద కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంది.
Images source: google
వర్క్ మధ్యలో విశ్రాంతి తీసుకోకపోవడం వల్ల బాడీ బాగా అలసిపోతుంది. దీంతో శరీరంలో రక్తప్రసరణ జరగక.. గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎక్కువ గంటలు పనిచేయవద్దు.
Images source: google
తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వస్తే ఐదు నుంచి పది నిమిషాలకు ఒక విరామం తీసుకోవడం మంచిది. కొందరు వర్క్ బిజీలో పడి ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోరు. దీనివల్ల అనారోగ్య సమస్యల వస్తాయి.
Images source: google