ఎండలు దంచి కొడుతున్నాయి..  ముఖ్యంగా కార్లలో తిరిగే వారు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు.

కారును చల్లగా ఉంచితే  ఏసీ ఉన్నా.. లేకున్నా.. ఎండవేడి నుంచి తట్టుకోవచ్చు. అందుకు కొన్ని టిప్స్

- నీడలో పార్క్ చేయండి  కారు నీడలో ఉన్నంత సేపు లోపలి భాగంలో వేడెక్కదు. లోపల వేడి లేనంత సేపు ఏసీ ఉన్నా.. లేకున్నా.. చల్లగా ఉంటుంది.

-విండో విజర్ ను ఉపయోగించాలి: కార్లకు సన్ షేడ్ వేసుకోవడం వల్ల లోపలి భాగం కూల్ గా ఉంటుంది. మార్కెట్లో ఇవి తక్కువ ధరకే లభిస్తాయి. అయితే సన్ షేడ్ పేరు చెప్పి ఫిల్మ్ వాడకూడదు. ఇవి చట్టరీత్యా నేరం.

-డ్యాష్ బోర్డ్ కవర్: కారు డ్యాష్ బోర్డ్ ను కవర్ తో కప్పి ఉంచాలి. ఇవి ఎండవేడికి దెబ్బ తినకుండా కాపాడుతాయి. తెల్లటి టవల్ వంటి వాటితో కూడా దీనిపై కప్పి ఉంచొచ్చు.

-కారు షీట్లను ఆహ్లదంగా ఉంచుకోండి..: కారులో వినైల్ లేదా లెదర్ సీట్లు ఉండడం వల్ల ఎక్కువ వేడిని గ్రహిస్తాయి.   సీట్లపై ఒక పీట్ తో కప్పి ఉంచడం బెటర్.

-కారు విండోస్ దించి ఉంచాలి: ఎండాకాలంలో కారు డోర్లు పూర్తిగా మూసి ఉంచడం వల్ల వేడి అలాగే ఉంటుంది. కాస్త డోర్లు దించడం వల్ల బయటి గాలి లోపలికి, లోపలి గాలి బయటకు వెళ్లి రిలాక్స్ గా మారుతుంది.

-స్టీరింగ్ ను జాగ్రత్తగా చూసుకోండి: ఎండ లోపలి వరకు వెళ్తుంది కాబట్టి స్టీరింగ్ పై ఎఫెక్ట్ తొందరగా పడుతుంది. దీనిని పట్టుకోవడంతో కాస్త అసౌకర్యంగా ఉంటుంది.   దీనిపై టవల్ లేదా మెత్తడి గుడ్డను కప్పి ఉంచాలి.

Off-white Banner

Thanks For Reading...